Share News

Viral Video: ఆహా.. ఏం వాడకమయ్యా..! ఇన్నాళ్లూ వాషింగ్ మెషిన్‌ అంటే దుస్తులు ఉతికేందుకే అనుకున్నాం.. కానీ..

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:18 PM

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక వస్తువును అంతా ఒకే పనికి వినియోగిస్తే.. కొదంరు మాత్రం దాన్ని అనేక రకాల పనులకు వినియోగిస్తుంటారు. ఇంకొందరికి..

Viral Video: ఆహా.. ఏం వాడకమయ్యా..! ఇన్నాళ్లూ వాషింగ్ మెషిన్‌ అంటే దుస్తులు ఉతికేందుకే అనుకున్నాం.. కానీ..

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక వస్తువును అంతా ఒకే పనికి వినియోగిస్తే.. కొదంరు మాత్రం దాన్ని అనేక రకాల పనులకు వినియోగిస్తుంటారు. ఇంకొందరికి.. ఎవరికీ రాని ఐడియాలన్నీ వచ్చేస్తుంటాయి. ఇలాంటి వారు చేసే ప్రయోగాలు చిత్రవిచిత్రంగా అనిపిస్తుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వాషింగ్ మెషిన్‌ని ఇతడు వినియోగించిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వాషింగ్ మెషిన్‌ను (Washing machine) .. ఎవరైనా బట్టలు ఉతికేందుకే వినియోగిస్తారు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్‌ను.. కూరగాయలు శుభ్రం చేయడానికి వినియోగించాడు. బంగాళాదుంపులను (Potatoes) తొక్క తీసి, శుభ్రం చేసేందుకు వాటిని చివరకు వాషింగ్ మెషిన్‌లో వేశాడు. బంగాళాదుంపలను అందులో వేసి, నీళ్ల పైపును ఆన్ చేశాడు.

Viral: వధువు కోసం ఇతడి వెతుకులాట మామూలుగా లేదుగా.. రిక్షాపై బయోడేటా రాసి మరీ..

స్టార్ట్ చేయగానే మెషిన్ గిరాగిరా తిరగడం వల్ల బంగాళాదుంపులపై తొక్క పోవడమే కాకుండా.. శుభ్రంగా మారిపోయాయి. ఇలా చాలా సేపు వాటిని అలాగే ఉంచడం వల్ల ఎలాంటి కష్టం లేకుండా బంగాళాదుంపులు వంటకు సిద్ధమయ్యాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది వాషింగ్ మెషినా.. లేక.. కూరగాయలు కడిగే మెషినా’’.. అంటూ కొందరు, ‘‘వాషింగ్ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ‘‘నీది మామూలు బ్రైన్ కాదయ్యా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 66వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ..! ఉజాలాతో సరికొత్త ప్రయోగం.. చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందంటే..

Updated Date - Feb 21 , 2024 | 03:18 PM