Share News

Viral Video: గేమ్ ఛేంజర్... క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ మొదలెట్టిన ఎద్దు.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:59 PM

జనావాసాల్లోకి జంతువులు చొరబడి బీభత్సం సృష్టించడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి చొరబడి హల్‌చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. అలాగే ...

Viral Video: గేమ్ ఛేంజర్... క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ మొదలెట్టిన ఎద్దు.. చివరికి ఏమైందంటే..

జనావాసాల్లోకి జంతువులు చొరబడి బీభత్సం సృష్టించడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి చొరబడి హల్‌చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. అలాగే మరికొన్నిసార్లు తమషా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఎద్దు క్రికెట్ ఆడుతున్న వారి వద్దకు వచ్చి.. ఏకంగా ఫుట్‌బాల్ మ్యాచ్ స్టార్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో! ఇది గేమ్ ఛేంజర్’’.. అంటూ కామెంట్కలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు మైదానంలో క్రికెట్ ఆడుతుంటారు. దూరంగా చాలా మంది నిలబడి.. ఆసక్తిగా మ్యాచ్ (cricket match) చూస్తుంటారు. అయితే ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. రెండు ఎద్దులు అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తాయి. వాటిలో ఒకటి అక్కడి నుంచి వెళ్లిపోగా.. మరో ఎద్దు సడన్‍‪‌గా ఆగి క్రికెట్ ఆడుతున్న వారిని చూస్తుంది. ‘‘ఎంత ధైర్యం..! నేను వచ్చానని తెలిసి కూడా నాకు నచ్చని క్రికెట్ గేమ్ ఆడుకుంటారా.. ఉండండి.. మీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుకుంటా’’.. అన్నట్లుగా ఆవేశంగా (bull ran into the cricket ground) వారి పైకి దూసుకొస్తుంది.

Viral Video: వామ్మో! ఈమేంటీ.. సిగరెట్ అడిగితే ఇవ్వలేదనే కోపంతో.. చివరకు మరీ ఇలా చేసిందేంటీ..

దీంతో అప్పటిదాకా ప్రశాంతంగా క్రికెట్ ఆడుతున్న వారు.. ఒక్కసారిగా పరుగందుకుంటారు. వారిలో ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన ఎద్దు.. అతన్ని తరుముకుంటూ వెంబడిస్తుంది. అతను కూడా ఎద్దుకు దొరక్కుండా కాళ్లకు పని చెబుతాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎద్దుకు క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం లేదేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎద్దు నిజంగా గేమ్ ఛేంజరే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇవెక్కడి తెలివితేటలురా బాబూ..! అకౌంట్ బ్యాలెన్స్ జీరో చూపించినా.. డబ్బులు ఎలా తీసుకున్నారో చూడండి..

Updated Date - Feb 20 , 2024 | 02:59 PM