Share News

Viral Video: గుర్రం ముందు ఇలాంటి డాన్స్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా.. ఇతడూ అలాగే చేస్తే చివరకు..

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:46 PM

శుభకార్యాలు జరిగే సమయంలో డబ్బు చప్పుళ్లకు తీన్మార్ డాన్సులు వేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో కొందరు తమ ప్రతిభ మొత్తం బయటపెడుతూ చిత్రవిచిత్రంగా డాన్సులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి ...

Viral Video: గుర్రం ముందు ఇలాంటి డాన్స్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా.. ఇతడూ అలాగే చేస్తే చివరకు..

శుభకార్యాలు జరిగే సమయంలో డబ్బు చప్పుళ్లకు తీన్మార్ డాన్సులు వేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో కొందరు తమ ప్రతిభ మొత్తం బయటపెడుతూ చిత్రవిచిత్రంగా డాన్సులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి డాన్సులు చూసి జనాలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సరదా సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఈ తరహా వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు గుర్రం ముందు పిచ్చి పిచ్చి డాన్సులు చేయాలని చూశాడు. అయితే చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదో కార్యక్రమం సందర్భంగా కొన్ని గుర్రాలను అందంగా అలంకరించి రోడ్డుపై ఊరేగింపు నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా గుర్రాలతో డప్పు చప్పుళ్లకు డాన్స్ వేయిస్తుంటారు. గుర్రాలు కూడా ఎంతో అందంగా కాళ్లు కదుపుతూ డప్పు చప్పుళ్లకు ( horses danced) అనుగుణంగా డాన్సు చేస్తుంటాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఓ యువకుడు సడన్‌గా అక్కడికి ఎంట్రీ ఇచ్చి.. గుర్రాలతో కలిసి డాన్సు చేస్తాడు. తన మానాన తాను డాన్సు చేసుకోకుండా.. గుర్రాలను వెక్కిరిస్తూ డాన్స్ చేస్తాడు. దీంతో అక్కడే ఉన్న ఓ గుర్రానికి చిర్రెత్తుకొస్తుంది. అదును కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

Viral Video: ట్రైనర్‌గా మారిన తల్లికుక్క.. గడప దాటే విధానంపై ఎలా శిక్షణ ఇస్తోందో చూడండి..

ఇంతలో ఆ యువకుడు డాన్స్ చేస్తూ వెనక్కు వెళ్తాడు. గుర్రం వెనుక కాళ్ల వద్ద నిలబడి అలాగే డాన్స్ చేస్తుంటాడు. ‘‘వీడికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’’.. అని అనుకుంటూ ఆ గుర్రం (horse kicked the man) ఒక్కసారిగా వెనుక కాలితో గట్టిగా తన్నుతుంది. దెబ్బకు అతను ఎగిరి పక్కన పడతాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంకోసారి ఇలాంటి వెకిలిచేష్టలు చేయడు’’.. అంటూ కొందరు, ‘‘గుర్రం ముందు ఇలా చేస్తే.. అలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న ఏనుగును గుర్తిస్తే.. మీరే జీనియస్..

Updated Date - Feb 17 , 2024 | 03:46 PM