Share News

Dog Viral Video: ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పెద్ద పేలుడును ఎలా ఆపేసిందంటే..

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:21 PM

పెంపుడు కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో రోజూ చూస్తూనే ఉంటాం. తన యజమాని ఇంటికి నిత్యం కాపలా కాస్తూ.. ఆపద సమయంలో అవసరమైతే తమ ప్రాణాలు కూడా ఫణంగా పెడుతుంటాయి. పెంపుడు కుక్కల కారణంగా...

Dog Viral Video: ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పెద్ద పేలుడును ఎలా ఆపేసిందంటే..

పెంపుడు కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో రోజూ చూస్తూనే ఉంటాం. తన యజమాని ఇంటికి నిత్యం కాపలా కాస్తూ.. ఆపద సమయంలో అవసరమైతే తమ ప్రాణాలు కూడా ఫణంగా పెడుతుంటాయి. పెంపుడు కుక్కల కారణంగా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తృటిలో తప్పిపోయిన సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కళ్ల ముందే ఎటక్ట్రిక్ బ్యాటరీ పేలిపోవడాన్ని చూసిన కుక్క.. చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వారి పెంపుడు కుక్క (pet dog) ఒక్కటే పడుకుని ఉంటుంది. అదే సమయలో దానికి ఎదురుగా ఎలక్ట్రిక్ బైకు (Electric bike) చార్జింగ్ అవుతుంటుంది. అయితే ఉన్నట్టుండి చార్జింగ్ వైరు వద్ద బ్యాటరీలో మంటలు వ్యాపిస్తాయి. దీన్ని గమనించిన కుక్క అటూ ఇటూ చూస్తుంది. మంటలు తగ్గకపోవడంతో వెంటనే అలెర్ట్ అవుతుంది. పరుగుపరుగున అక్కడికి వెళ్లి కాలిపోతున్న బ్యాటరీ వైరును నోటితో పట్టుకుని దూరంగా లాగుతుంది. ఇలా అటూ ఇటూ లాగడంతో చివరకు మంటలు ఆరిపోతాయి.

Valentine's Day Video: ప్రేమికుల రోజు వేడుకలకు ఆవును తీసుకొచ్చిన వ్యక్తి.. చివరకు అతడి క్రియేటివిటీ చూసి అంతా షాక్..

పూర్తిగా మంటలు ఆరిపోవడం చూసి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. అంతటితో ఆగకుండా తన యజమానికి వినిపించేలా మొరుగుతూ హెచ్చరిస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే ఆశ్చర్య కలుగుతోంది’’.. అంటూ కొందరు, ‘‘మనుషులకంటే కుక్కలే నయం’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రాణాలకు తెగించి మంటలు ఆర్పేయడం నిజంగా గ్రేట్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు.. డ్రైవర్ చెప్పిన ఆ మాటకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Feb 15 , 2024 | 09:21 PM