Share News

Viral Video: బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు.. డ్రైవర్ చెప్పిన ఆ మాటకు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:39 PM

ఏనుగులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని ఏనుగులైతే జనావాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్ని ఏకంగా వాహనాలను సైతం ఎత్తి రోడ్డు పక్కన పడేస్తుంటాయి. దీంతో చాలా మంది...

Viral Video: బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు.. డ్రైవర్ చెప్పిన ఆ మాటకు ఏం చేసిందో చూడండి..

ఏనుగులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని ఏనుగులైతే జనావాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్ని ఏకంగా వాహనాలను సైతం ఎత్తి రోడ్డు పక్కన పడేస్తుంటాయి. దీంతో చాలా మంది వాహనదారులు ఏనుగులను చూస్తేనే భయంతో వణికిపోతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అటవీ ప్రాంతంలో వెళ్తున్న ఓ బస్సుకు ఏనుగు ఎదురుపడింది. ఏకంగా బస్సు ఎదురుగా రావడంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. అయితే చివరకు డ్రైవర్ చెప్పిన ఒక్కమాటతో ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు, కర్ణాటక (Karnataka) సరిహద్దు సమీపంలోని కరపల్లం చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. చెక్ పోస్టు దాటుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఓ భారీ ఏనుగు రోడ్డు పక్కన నిలబడి ఉంది. దీంతో బస్సు డ్రైవర్ కాస్త దూరంగానే వాహనాన్ని నిలిపేశాడు. అయితే చూస్తుండగానే ఏనుగు రోడ్డు మీదకు వచ్చి, (elephant came in front of the bus) బస్సు ఎదురుగా వచ్చేసింది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయపడిపోయారు.

Viral Video: వాహనాల సమస్యకు వేడి నీటితో చెక్.. ఇతను చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

డ్రైవర్ బస్సును కొద్ది దూరం వెనక్కు పోనిచ్చాడు. అయినా ఏనుగు అలాగే వస్తుండడంతో ప్రయాణికులు మరింత భయపడ్డారు. దీంతో డ్రైవర్.. ఈ ఏనుగు ఏమీ చేయదంటూ వారికి ధైర్యం చెబుతూ.. ‘‘బాయ్ పెద్దన్నయ్యా’’.. అని చెప్తాడు. దీంతో ఏనుగు కూడా.. ‘‘ఒకే తమ్ముడూ.. క్షేమంగా వెళ్లిరా’’.. అన్నట్లుగా తల ఆడించుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ప్రయాణికులంతా.. హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ డ్రైవర్ ధైర్యానికి సెల్యూట్’’.. అంటూ కొందరు, ‘‘వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్నారే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Valentine's Day Video: ప్రేమికుల రోజు వేడుకలకు ఆవును తీసుకొచ్చిన వ్యక్తి.. చివరకు అతడి క్రియేటివిటీ చూసి అంతా షాక్..

Updated Date - Feb 15 , 2024 | 08:39 PM