Share News

Valentine's Day: కళాశాల ఆవరణలో కలుసుకున్న ప్రేమికులు.. ప్రేయసికి విషెస్ చెబుతాడనుకుంటే.. చివరకు..

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:50 PM

ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఒకరికొకరు విషెష్ చెప్పుకోవడం, గిఫ్టులు ఇచ్చుకోవడం సర్వసాధారణం. అలాగే ...

Valentine's Day: కళాశాల ఆవరణలో కలుసుకున్న ప్రేమికులు.. ప్రేయసికి విషెస్ చెబుతాడనుకుంటే.. చివరకు..

ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఒకరికొకరు విషెష్ చెప్పుకోవడం, గిఫ్టులు ఇచ్చుకోవడం సర్వసాధారణం. అలాగే కొందరు ప్రేమికులు ఈ రోజును స్పెషల్‌గా మార్చుకునేందుకు టూర్‌లకు ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు తాము ప్రేమించిన వారిని వినూత్న రీతిలో సర్‌ప్రైజ్ చేయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమజంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఓ ప్రేమ జంట తమ కళాశాల ఆవరణలో కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రియుడు తన ప్రేయసికి విషెస్ చెబుతాడనుకుంటే.. చివరకు పెద్ద షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రేమికుల రోజు (Valentine's Day) సందర్భంగా బుధవారం ఎక్కడ చూసినా ప్రేమికుల సందడే కనిపించింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ప్రేమ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా హర్యానాలో ప్రేమికుల మధ్య చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఓ ప్రేమ జంట జిందాల్ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ ప్రాంగణంలో కలుసుకున్నారు. ప్రేయసి వద్దకు వెళ్లిన ప్రియుడు విషెస్ చెబుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను అందుకు విరుద్ధంగా ప్రవర్తించి అందరికీ షాక్ ఇచ్చాడు.

Viral Video: ఈ వరుడు నక్క తోక తొక్కినట్టున్నాడే.. పెళ్లిలో వధువు కుటుంబం ప్రకటించిన బహుమతుల లిస్ట్ తెలిస్తే..

ప్రియుడి వద్దకు వచ్చిన యువతి ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది. అయితే ఆమె సమీపానికి రాగానే అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే (man assaults girlfriend) ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను దూరంగా ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనసై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి శాడిస్టులను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలా ప్రవర్తించడం అమానుషం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ చెట్ల మధ్యన దాక్కున్న.. మూడు గుడ్లగూబలను కనిపెట్టడం మీ వల్ల అవుతుందా..?

Updated Date - Feb 14 , 2024 | 02:51 PM