Share News

Viral Video: మ్యాగీలో ఇదెక్కడి కాంబినేషన్‌రా నాయనా.. పాలు, కాఫీ పొడి మిక్స్ చేసి మరీ..

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:55 PM

కొందరికి రోజు వారీ వంటకాలనే కాస్త సరికొత్తగా చేయడం అలవాటు. మరికొందరికి అదే వంటకాలలో సరికొత్త పదార్థాలను మిక్స్ చేయడం అలవాటు. ఇంకొందరికేమో.. ఊహించని పదార్థాలను కలిపి కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తుంటారు. అయితే...

Viral Video: మ్యాగీలో ఇదెక్కడి కాంబినేషన్‌రా నాయనా.. పాలు, కాఫీ పొడి మిక్స్ చేసి మరీ..

కొందరికి రోజు వారీ వంటకాలనే కాస్త సరికొత్తగా చేయడం అలవాటు. మరికొందరికి అదే వంటకాలలో సరికొత్త పదార్థాలను మిక్స్ చేయడం అలవాటు. ఇంకొందరికేమో.. ఊహించని పదార్థాలను కలిపి కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తుంటారు. అయితే ఇలాంటి వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తయారు చేసిన మ్యాగీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పాలు, కాఫీ పొడి మిక్స్ చేసి మ్యాగీ తయారు చేయడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘మ్యాగీలో ఇదెక్కడి కాంబినేషన్‌రా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన మ్యాగీ (Maggi) సిద్ధం చేస్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అందులో అతను మిక్స్ చేసిన పదార్థాలను చూసి అంతా షాక్ అవుతున్నారు. ముందుగా అతను పాన్‌లో పాలు పోసి వేడి చేశాడు. తర్వాత అందులో (Maggi made with milk and coffee powder) మ్యాగీతో పాటూ తరిగిన టమోట, పసుపు, మసాలా పౌడర్ తదితరాలను మిక్స్ చేశాడు. ఇలా చివరకు ఫైనల్‌గా కాఫీ మ్యాగీని సిద్ధం చేశాడు.

Viral Video: గడ్డ కట్టే మంచులో పొగలు కక్కే కాఫీ.. వీళ్ల అతి తెలివి చూస్తే అవాక్కవకుండా ఉండలేరు..

ఈ మ్యాగీని టేస్ట్ చేసిన వారంతా ఇదెక్కడి కాంబినేషన్ బాబాయ్.. అని అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతను దేవుడు క్షమించడు’’.., ‘‘నాకు జీవితంపై విరక్తిపుడుతోంది’’.., ‘‘ఇకపై మ్యాగీని తినాలంటేనే అసహ్యంగా ఉంటుందేమో’’.., ‘‘యుముడిని కలిసే విధానం చాలా కొత్తగా ఉంది’’.., ‘‘మీ ప్రయోగాల కోసం మ్యాగీని ఎందుకు బలి చేస్తున్నారు’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పెద్దాయన చాలా అప్‌డేట్‌గా ఉన్నాడే.. వధూవరుల మధ్యలోకి వచ్చి ఎలాంటి సలహా ఇచ్చాడంటే..

Updated Date - Feb 13 , 2024 | 06:55 PM