Share News

Optical illusion puzzle: గుర్రంపై ఉన్న రాజుకు దొరక్కుండా.. ముగ్గురు దొంగలు దాక్కుని ఉన్నారు.. కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Feb 10 , 2024 | 09:42 PM

ఈ ఫొటోలో గుర్రంపై వచ్చిన రాజు దొంగల కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ముగ్గురు దొంగలు రాజుకు దొరక్కుండా దాక్కుని ఉంటారు. ఈ ఫొటోలో వారు ఎక్కడున్నారో కనిపెట్టేందుకు ట్రై చేయండి..

Optical illusion puzzle: గుర్రంపై ఉన్న రాజుకు దొరక్కుండా.. ముగ్గురు దొంగలు దాక్కుని ఉన్నారు.. కనుక్కోండి చూద్దాం..

ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనిషి మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. బిజీ బిజీ లైఫ్‌లో శరీరంతో పాటూ మెదడుకూ విశ్రాంతి దొరకడం లేదు. ఈ క్రమంలో ఆటలు ఆడటం, వివిధ రకాల ఫజిల్స్‌ను పరిష్కరించడం తదితరాలు చేయడం ద్వారా మెదడు షార్ప్‌గా తయారవుతుంది. ప్రధానంగా ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఫజిల్స్ కూడా ఇందుకు ఎంతో దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోలో గుర్రంపై వచ్చిన రాజు దొంగల కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ముగ్గురు దొంగలు రాజుకు దొరక్కుండా దాక్కుని ఉంటారు. ఈ ఫొటోలో వారు ఎక్కడున్నారో కనిపెట్టేందుకు ట్రై చేయండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫజిల్ ఫొటో (Optical illusion puzzle photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ రాజు ముగ్గురు దొంగలను పట్టుకునేందుకు గుర్రంపై వస్తాడు. అయితే ఆ దొంగలు రాజుకు దొరక్కుండా దాక్కుని ఉంటారు. రాజు గుర్రంపై కూర్చుని వారిని వెతికే పనిలో పడ్డాడు. అతడికి సమీపంలోనే దొంగలు ఉన్నా కూడా రాజు మాత్రం గుర్తించలేడు. ఇప్పుడు ఈ ఫొటోను బాగా పరిశీలించి, ఆ దొంగలు ఎక్కడెక్కడ దాక్కున్నారో కనుక్కోండి. వారిని గుర్తించడం అంత సులభమేమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. ఇంకెందుకు ఆలస్యం ఆ ముగ్గురు దొంగలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించేందుకు ప్రయత్నించండి మరి.. ఒకవేళ వారిని గుర్తించడం మీకు సాధ్యం కాకపోతే ఈ కింద ఫొటో చూసి, వారు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కోవచ్చు.

Optical-illusion-puzzle-pho.jpg

Optical illusion: ఈ చిత్రంలో మరో గుర్రం కూడా దాక్కుని ఉంది.. దాన్ని కనిపెట్టడం మీవల్ల అవుతుందేమో ట్రై చేయండి..

Updated Date - Feb 10 , 2024 | 09:42 PM