Share News

Pre - Wedding Video: కాబోయే భార్యతో.. ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. పేషెంట్ ఖుషీ.. చివరకు వైద్యుడేమో..

ABN , Publish Date - Feb 10 , 2024 | 03:14 PM

ప్రస్తుత వివాహ కార్యక్రమాల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. పెళ్లికి ముందు, తర్వాత ఫొటో షూట్ నిర్వహించడం షరా మామూలు అయింది. ఇది కూడా సాదాసీదాగా కాకుండా ఏకంగా...

Pre - Wedding Video: కాబోయే భార్యతో.. ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. పేషెంట్ ఖుషీ.. చివరకు వైద్యుడేమో..

ప్రస్తుత వివాహ కార్యక్రమాల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. పెళ్లికి ముందు, తర్వాత ఫొటో షూట్ నిర్వహించడం షరా మామూలు అయింది. ఇది కూడా సాదాసీదాగా కాకుండా ఏకంగా సినిమా సీన్లను తలదన్నేలా ప్లాన్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు అసలుకే ఎసరు తెస్తుంటాయి. తాజాగా, ఓ డాక్టర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ వైద్యుడు తన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను ఆఆపరేషన్ థియేటర్‌లో నిర్వహించాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (viral video) అవుతోంది. కర్నాటక (Karnataka) చిత్రదుర్గ జిల్లా భరమసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. దీంతో అందరిలాగానే తన కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్‌కు (

Pre wedding shoot) ప్లాన్ చేశాడు. అయితే మిగతా వారిలా కాకుండా ఇంకాస్త విభిన్నంగా చేయాలని వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. ‘‘ఎక్కడో ఎందుకు.. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లోనే (Hospital operation theatre) నిర్వహిస్తే పోలా’’.. అని అనుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే ఈ షూట్ కోసం ఓ వ్యక్తిని పేషెంట్‌లాగా బెడ్‌పై పడుకోబెట్టి.. భార్యతో కలిసి అతడికి ఆపరేషన్ చేస్తున్నట్లు కెమెరాకు ఫోజులు ఇచ్చారు. భర్త యాక్టింగ్ చూసి భార్య నవ్వు ఆపుకోలేకపోయింది.

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

చివరగా టేక్ ఓకే.. అనగానే పడుకుని ఉన్న పేషెంట్ లేచి కూర్చుని నవ్వుతూ కెమెరాకు ఫోజు ఇచ్చాడు. ఇలాంటి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ వీడియో వైరల్ అవడంతో విషయం కర్నాటక ఆరోగ్యశాఖ మంతి వరకూ వెళ్లింది. ఆయన ఆదేశాలతో చిత్రదుర్గ జిల్లా వైద్యాధికారులు విచారణ చేసి సదరు వైద్యుడిని విధుల నుంచి తొలగించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ‘‘నేషనల్​ హెల్త్​ మిషన్​ కింద నెల రోజుల క్రితం సదరు వైద్యుడిని కాంట్రాక్ట్​ ఉద్యోగంలో నియమించుకున్నాం. వీడియోలో కనిపిస్తున్న ఆపరేషన్​ థియేటర్‌ రిపేరులో ఉండడంతో ప్రస్తుతం ఎవరూ వాడట్లేదు. అయినా క్రమశిక్షణ లేకుండా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సహించం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’’ అని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంట్లోకి వెళ్లేందుకు పాము ప్రయత్నం.. ఎలాగైనా ఆపేందుకు కుక్కల విశ్వప్రయత్నం.. చివరకు..

Updated Date - Feb 10 , 2024 | 03:14 PM