Share News

Viral Video: ఇంట్లోకి వెళ్లేందుకు పాము ప్రయత్నం.. ఎలాగైనా ఆపేందుకు కుక్కల విశ్వప్రయత్నం.. చివరకు..

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:44 PM

పాములు, కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాములు కుక్కల చేతిలో ప్రాణాలు కోల్పోతే.. మరికొన్నిసార్లు కుక్కలు ఊహించని రీతిలో..

Viral Video: ఇంట్లోకి వెళ్లేందుకు పాము ప్రయత్నం.. ఎలాగైనా ఆపేందుకు కుక్కల విశ్వప్రయత్నం.. చివరకు..

పాములు, కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాములు కుక్కల చేతిలో ప్రాణాలు కోల్పోతే.. మరికొన్నిసార్లు కుక్కలు ఊహించని రీతిలో పాము కాటుకు బలవుతుంటాయి. తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కుక్కలు పాముతో పోరాడి తమ యజమానులను రక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పాము ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దాన్ని ఆపేందుకు కుక్కలు విశ్వప్రయత్నం చేశాయి. చివరకు ఏమైందో చూడండి..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) శ్రావస్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇకౌనా ప్రాంతంలోని ఓ ఇంటి (snake tried to enter the house) ఆవరణలోకి పాము చొరబడింది. దాన్ని చూడగానే అక్కడే ఉన్న మూడు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. వాటిలో ఓ కుక్క మరింత గట్టిగా మొరుగుతూ పాము సమీపానికి వచ్చి.. ఇంట్లోకి వెళ్లకుండా ఆపాలని చూసింది. అయితే పాము కూడా బుసలు కొడుతూ వాటిని భయపెట్టింది. వాటిలో రెండు కుక్కలు భయంతో దూరంగా ఉన్నా.. ఓ కుక్క మాత్రం ఏమాత్రం భయపడకుండా మొరుగుతూ పామును అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

Viral Video: ఇదెక్కడి టెక్నిక్‌రా నాయనా.. మహిళ వెనుకే నిలబడి.. అంతా చూస్తుండగానే ఐ ఫోన్ చోరీ..

అయినా పాము ఎటూ కదలకుండా కుక్క పైకి బుసలు కొడుతూ అక్కడే ఉండిపోయింది. అంతలో ఇంటి యజామాని బయటికి వచ్చింది. పామును చూసి ఆమె కూడా షాక్ అయింది. ఇలా చాలా సేపు పాము అక్కడే ఉండిపోయింది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్క విశ్వాసం అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘పామును ఆపాలని కుక్క ఎంతో ప్రయత్నించింది’’.. అంటూ మరికొందరు, ‘‘థ్యాంక్స్ గాడ్.. ఎవరికీ ఏమీ కాలేదు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో... అంతా పెళ్లి సందడిలో ఉంటే.. ఇతనేమో సైలెంట్‌గా..

Updated Date - Feb 09 , 2024 | 04:35 PM