Share News

Viral Video: ఇదెక్కడి టెక్నిక్‌రా నాయనా.. మహిళ వెనుకే నిలబడి.. అంతా చూస్తుండగానే ఐ ఫోన్ చోరీ..

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:17 PM

చోరీలకు పాల్పడే వారు ఎంతో తెలివిగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కొందరు దొంగలు పోలీసులకు దొరక్కుండా ఎంతో చాకచక్యంగా చోరీలు చేస్తుంటారు. ఈ క్రమంలో నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు నానాతంటాలు పడాల్సి వస్తుంటుంది. అయితే...

Viral Video: ఇదెక్కడి టెక్నిక్‌రా నాయనా.. మహిళ వెనుకే నిలబడి.. అంతా చూస్తుండగానే ఐ ఫోన్ చోరీ..

చోరీలకు పాల్పడే వారు ఎంతో తెలివిగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కొందరు దొంగలు పోలీసులకు దొరక్కుండా ఎంతో చాకచక్యంగా చోరీలు చేస్తుంటారు. ఈ క్రమంలో నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు నానాతంటాలు పడాల్సి వస్తుంటుంది. అయితే ప్రస్తుతం సీసీ కెమెరాలు అందుబాటులో ఉండడంతో ఇలాంటి తెలివైన నేరస్థులు కూడా సులభంగా పట్టుబడుతున్నారు. ఈ తరహా చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ మహిళ వెనుకే నిలబడి అంతా చూస్తుండగానే ఐఫోన్ చోరీ చేశాడు. ఇతడి తెలివితేటలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన వారణాసిలో జరిగింది. ఇద్దరు మహిళలు రోడ్డు పక్కన నిలబడి తమకు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. అంతలో ఓ యువకుడు వాళ్ల వద్దకు వచ్చి నిలబడతాడు. కాసేపు మహిళలనే గమనిస్తూ ఉంటాడు. మహిళలు ఇదేమీ పట్టించుకోకుండా వారి ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారిలో ఓ మహిళ తన ఐ ఫోన్‌ను (Woman iPhone) కోటు జేబులో పెట్టుకుంటుంది.

Viral Video: ఇది కదా వాడకం అంటే.. పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని.. ఇలా వాడాలని ఎవరికైనా అనిపిస్తుందా..

మహిళ తన ఫోన్‌ను జేబులో పెట్టుకోవడాన్ని గమనించిన యువకుడు.. తర్వాత మెల్లగా ఆమె దగ్గరికి వస్తాడు. చేతిలో ఉన్న ప్లాస్టిక్ పేపర్‌ను అడ్డుగా పెట్టి ఆమె కోటు జేబులోని ఫోన్ ఎంతో చాకచక్యంగా తీసుకుంటాడు. తర్వాత తనకేమీ తెలీనట్లు అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోతాడు. ఆ సమయంలో చుట్టూ అంతా ఉన్నా కూడా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మహిళ తనకు జరిగిన ఈ అనుభవాన్ని వివరిస్తూ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘ఇదెక్కడి చోరీరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! వీడు మామూలు దొంగ కాదు’’.. అంటూ మరికొందరు, ‘‘సీసీ కెమెరాలు లేకుంటే ఇలాంటి చోరీలు బయటపడవేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

బాదం తొక్కలను పక్కన పడేస్తున్నారా.. ఇకపై ఇలా చేసి చూడండి...

Updated Date - Feb 08 , 2024 | 06:17 PM