Share News

Wedding Video: వధువు ముందే వరుడి స్నేహితుడి తుంటరి చేష్టలు.. బాబోయ్..! ఇలాక్కూడా గిఫ్ట్‌లు ఇస్తారా..

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:45 PM

వివాహ కార్యక్రమంలో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అన్ని రంగాల్లోనూ ఈ ఎఫెక్ట్ కనపడుతోంది. ప్రధానంగా వివాహ కార్యక్రమాల్లో అయితే ...

Wedding Video: వధువు ముందే వరుడి స్నేహితుడి తుంటరి చేష్టలు.. బాబోయ్..! ఇలాక్కూడా గిఫ్ట్‌లు ఇస్తారా..

వివాహ కార్యక్రమంలో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అన్ని రంగాల్లోనూ ఈ ఎఫెక్ట్ కనపడుతోంది. ప్రధానంగా వివాహ కార్యక్రమాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి కార్డు దగ్గర నుంచి వధువు అప్పగింతల కార్యక్రమం వరకూ ప్రతీదీ ఎంతో ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో వధూవరుల స్నేహితులు చేసే అల్లరి అంతా ఇంకా కాదు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరుడి స్నేహితుడు చేసిన తుంటరి పనికి వధువుతో పాటూ అతిథులంతా పగలబడి నవ్వుకున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమం అంటే.. సాధారణంగానే సందడి సందడిగా ఉంటుంది. దీనికితోడు యువతీయువకుల అల్లరి కూడా కార్యక్రమానికి మరింత ఉత్సాహంగా మారుస్తుంటుంది. దీనికితోడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోషల్ మీడియా కూడా తోడవడంతో.. చివరకు వివాహ కార్యక్రమం (wedding ceremony) కాస్తా.. అందరికీ మంచి వినోద కార్యక్రమంగా కూడా మారుతోంది. కొన్ని వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలు.. నెటిజన్లను విపరీతంగా నవ్విస్తుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Optical illusion: ఈ చిత్రంలో మొత్తం 10 మొఖాలు ఉన్నాయి.. కనుక్కోగలరేమో ట్రై చేయండి...

వివాహ వేదికపై ఉన్న వధూవరులకు.. బంధువులు, స్నేహితులంతా బహుమతులు అందిస్తూ ఫొటోలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో వరుడి స్నేహితుడు కూడా అక్కడికి వస్తాడు. అందరిలా మామూలు గిఫ్ట్ ఇస్తే... ఏం కిక్కు ఉంటుందీ.. ఏదైనా వినూత్నమైన గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాడో ఏమో గానీ.. చేతిలో ఓ మట్టి కూజా వంటి వస్తువును పట్టుకొస్తాడు. వచ్చిన వాడు దాన్ని వరుడికి అందించి వెళ్లిపోకుండా.. వారి వద్దకు రాగానే.. ఆ మట్టి కూజాను ఎలా ఉపయోగించాలో వరుడికి చేసి చూపిస్తాడు. ఈ యువకుడి నిర్వాకం చూసి అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. అక్కడే ఉన్న వధువు కూడా ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది రాజమౌళి ఈగ కాదు.. ఈ వ్యక్తి ఈగకు ఇచ్చిన ట్రైనింగ్ చూస్తే నోరెళ్లబెడతారు..

Updated Date - Feb 07 , 2024 | 03:45 PM