Share News

Viral Video: ఇది రాజమౌళి ఈగ కాదు.. ఈ వ్యక్తి ఈగకు ఇచ్చిన ట్రైనింగ్ చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:11 PM

జంతువులు, పక్షులు మనుషులను అనుకరించడంతో పాటూ వారు చెప్పినట్లు వినడం చూస్తూ ఉంటాం. కొన్ని జంతువులైతే తమ యజమాని ఇలా సిగ్నల్ ఇవ్వగానే అలా అల్లుకుపోతుంటాయి. అంతలా వాటికి శిక్షణ ఇస్తుంటారు. జంతువులు, పక్షులకు ...

Viral Video: ఇది రాజమౌళి ఈగ కాదు.. ఈ వ్యక్తి ఈగకు ఇచ్చిన ట్రైనింగ్ చూస్తే నోరెళ్లబెడతారు..

జంతువులు, పక్షులు మనుషులను అనుకరించడంతో పాటూ వారు చెప్పినట్లు వినడం చూస్తూ ఉంటాం. కొన్ని జంతువులైతే తమ యజమాని ఇలా సిగ్నల్ ఇవ్వగానే అలా అల్లుకుపోతుంటాయి. అంతలా వాటికి శిక్షణ ఇస్తుంటారు. జంతువులు, పక్షులకు శిక్షణ ఇవ్వడం సులభమే కానీ.. ఈగలకూ ఇలాంటి శిక్షణే ఇవ్వొచ్చా అని అంటే.. ‘‘ఇదేమన్నా.. రాజమౌళి ఈగ సినిమా అనుకున్నారా’’.. అని అంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఈగకే ట్రైనింగ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బుద్ధిగా శిక్షణ తీసుకుంటున్న ఈగ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అసలు సిసలైన ట్రైనర్ అంటే ఇతనే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శిక్షణ తీసుకున్న ఈగ చివరకు విలన్‌పై దాడి చేయడం... రాజమౌళి ఈగ సినిమాలో (Eega movie) అంతా చూశాం. అయితే ఇలా ఈగ శిక్షణ తీసుకోవడం సినిమాల్లో సాధ్యం కానీ.. నిజ జీవితంలో ఎలా సాధ్యం అని అంతా అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి దీన్ని నిజం చేసి చూపించాడు. చూపించడమే కాదు.. ఏకంగా ఈగకు వివిధ రకాల శిక్షణ ( man trained the fly) కూడా ఇచ్చాడు. ఓ టేబుల్‌పై ఉన్న ఈగ తన బాస్ ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో సదరు వ్యక్తి ఈగ ముందు వేలు చూపించి, ముందుకు రావాలని సిగ్నల్ ఇస్తాడు. తన బాస్ చెప్పిన విధంగా ఈగ కూడా వేలు మోపిన చోటుకు వస్తుంది.

Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..

తర్వాత తన వేలును మరో చోట పెడతాడు. ఈగ కూడా వెంటనే ఆ ప్లేస్‌లో వెల్లి వాలుతుంది. ఈ తర్వాత ఈగకు మరింత గట్టి పరీక్ష పెడతాడు. ఓ వృత్తాకార ప్లాస్టిక్ బిళ్లను ఈగ ముందు నిలబెడతాడు. దీంతో ఈగ ఆ బిళ్లను కొంత దూరం ముందుకు నెట్టుకుంటూ వెళ్తుంది. తర్వాత ‘‘టార్గెట్ కంప్లీట్’’.. అని అన్నట్లుగా తన బాస్ వద్దకు వచ్చి వాలిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది ఇస్మార్ట్ ఈగలా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా అసలు సిసలైన ట్రైనింగ్ అంటే’’.. అంటూ మరికొందరు, ‘‘అరే! ఇది కలా.. లేక నిజమా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jokes: ఐదేళ్లు కోమాలో ఉన్న మహిళ.. తల్లి చెప్పిన ఒకే ఒక్క జోక్‌తో ఎలా స్పృహలోకి వచ్చిందంటే..

Updated Date - Feb 06 , 2024 | 09:11 PM