Share News

Watch video: తీన్మార్ దరువులకు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఏనుగు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Feb 04 , 2024 | 06:38 PM

కుక్కలు, కోతులు, చింపాంజీలు.. మనుషులను అనుసరిస్తూ డాన్సులు వేయడం సర్కస్‌లలో చూస్తుంటాం. కొన్ని పెంపుడు జంతువులు కూడా యజమాని ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అయితే..

Watch video: తీన్మార్ దరువులకు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఏనుగు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కుక్కలు, కోతులు, చింపాంజీలు.. మనుషులను అనుసరిస్తూ డాన్సులు వేయడం సర్కస్‌లలో చూస్తుంటాం. కొన్ని పెంపుడు జంతువులు కూడా యజమాని ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అయితే ఏనుగులు మనుషులను అనుసరించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ పెద్ద ఏనుగు తీన్మార్ దరువులకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ ఏనుగు డాన్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తిరునాళ్ల జరుగుతున్న ఓ ప్రాంతంలో అంతా నృత్యాలు చేస్తుంటారు. అంతలో ఓ మావటి అలంకరించిన ఏనుగుతో అక్కడికి వస్తాడు. తీన్మార్ దరువు మొదలవగానే అంతా ఏనుగు చుట్టూ చేరి, డాన్స్ చేసేందుకు ప్రోత్సహిస్తారు. ఏనుగు కూడా ఏమాత్రం తడబడకుండా వెంటనే రంగంలోకి దిగుతుంది. తీన్మార్ దరువుకు అనుగుణంగా (elephant started dancing to the drum beat) అచ్చం మనుషుల్లాగానే స్టెప్పులు వేసింది. మధ్య మధ్యలో ముందు కాళ్లను వంచి నేలపై పడుకోవడం చేస్తూ, అటూ ఇటూ తిరుగుతూ డాన్స్ చేసింది.

Viral Video: టీచర్ పాఠాలు చెబుతుంటే.. వెనుక ఈ విద్యార్థి చేసిన పనికి అవాక్కయిన అమ్మాయిలు..

ఈ డాన్స్ చూస్తే మనుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. చూస్తుంటే.. ఇది నిజంగానే ఏనుగేనా.. లేక ఏనుగు రొబోనా.. అని అనిపిస్తుంది. అంతలా ఆ ఏనుగు తన డాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ ఏనుగు డాన్స్ ఎక్సలెంట్’’.. అంటూ కొందరు, ‘‘మనుషులు కూడా ఇంత బాగా డాన్స్ చేయరేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చెట్టు పైనుంచి షాక్ ఇచ్చిన భారీ కొండచిలువ.. సమీపానికి వెళ్లి చూడగా.. అది చేస్తున్న నిర్వాకం..

Updated Date - Feb 04 , 2024 | 07:15 PM