Share News

Viral Video: చెట్టు పైనుంచి షాక్ ఇచ్చిన భారీ కొండచిలువ.. సమీపానికి వెళ్లి చూడగా.. అది చేస్తున్న నిర్వాకం..

ABN , Publish Date - Feb 04 , 2024 | 03:28 PM

సోషల్ మీడియాలో పాములు, కొండ చిలువలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని పాములు ఇళ్లల్లోని ఫ్రిడ్జిలు, మంచాలు, తలుపుల మాటు నుంచి బుసలు కొడుతూ బయటికి రావడం చూస్తూ ఉంటాం. అలాగే..

Viral Video: చెట్టు పైనుంచి షాక్ ఇచ్చిన భారీ కొండచిలువ.. సమీపానికి వెళ్లి చూడగా.. అది చేస్తున్న నిర్వాకం..

సోషల్ మీడియాలో పాములు, కొండ చిలువలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని పాములు ఇళ్లల్లోని ఫ్రిడ్జిలు, మంచాలు, తలుపుల మాటు నుంచి బుసలు కొడుతూ బయటికి రావడం చూస్తూ ఉంటాం. అలాగే కుక్కలు, కోతులు, మేకలపై దాడులు చేసే కొండచిలువలనూ చాలా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చెట్టుపై భారీ కొండచిలువ అందరికీ షాక్ ఇచ్చింది. సమీపానికి వెళ్లి దాన్ని చూసిన వారంతా అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చెట్టుపై ఏదో వింత ఆకారం ఉన్నట్లు అనుమానం రావడంతో కొందరు దాని సమీపానికి వెళ్లే ప్రయత్నం చేశారు. చెట్టు వద్దకు వెళ్లి పైన ఏముందోనని చూశారు. అయితే చెట్టుపై ఓ అతి పెద్ద కొండచిలువ (largest python) ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. చెట్టుపై చుట్టేసుకుని పడుకున్న కొండచిలువ.. ఎటూ కదలకుండా పడుకుని ఉండడం చూసి అంతా అవాక్కయ్యారు.

Viral Video: ఈ పక్షుల తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వ్యక్తి గడ్డికి నిప్పు పెట్టగానే.. ఏం చేశాయో చూడండి..

కొందరు ఈ కొండచిలువను ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇంత పెద్ద కొండచిలువను.. ఇంతకు ముందెన్నడూ చూడలేదు’’.. అని కొందరు, ‘‘ఇది నిజమా.. లేక గ్రాఫిక్సా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

రోజూ ఉదయం లేవగానే కొత్తిమీర నీరు తాగితే.. ఏమవుతుందంటే..

Updated Date - Feb 04 , 2024 | 03:28 PM