Share News

Viral Video: లక్కీ ఛాన్స్ కొట్టాడుగా.. వధువు పక్కన వరుడి ఎక్స్‌ప్రెషన్ చూడగానే.. నెటిజన్ల రియాక్షన్ ఇదీ..

ABN , Publish Date - Feb 03 , 2024 | 06:43 PM

‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి’’.. అని పెద్దలు అంటుంటారు. కొందరు వధూవరులను చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంటుంది. కొన్ని జంటలను చూసినప్పుడు.. ఈడూజోడూ ఎంతో బాగుంది అని అంటూ ఉంటారు. మరికొందరిని...

Viral Video: లక్కీ ఛాన్స్ కొట్టాడుగా.. వధువు పక్కన వరుడి ఎక్స్‌ప్రెషన్ చూడగానే.. నెటిజన్ల రియాక్షన్ ఇదీ..

‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి’’.. అని పెద్దలు అంటుంటారు. కొందరు వధూవరులను చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంటుంది. కొన్ని జంటలను చూసినప్పుడు.. ఈడూజోడూ ఎంతో బాగుంది అని అంటూ ఉంటారు. మరికొందరిని చూసినప్పుడు అవాక్కవుతుంటారు. ఇలాంటి వధూవరులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న నూతన జంటను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. వరుడి ఫేస్ చూసిన నెటిజన్లు.. ‘‘ఇతడు లక్కీ ఛాన్స్ కొట్టాడు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) పక్క పక్కన నిల్చుని ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఆ సమయంలో వరుడి మొఖం కనిపించకుండా తెర ఉంటుంది. పక్కనే నిలబడి ఉన్న అందమైన వధువు నవ్వుతూ వరుడి వైపు చూస్తుంది. తర్వాత వరుడు తన మొఖాన్ని కెమెరాకు చూపిస్తూ ఎంతో సంబరపడిపోతాడు.

Viral Video: నీటి ఒడ్డున షాకింగ్ దృశ్యం.. వేట కోసం దాక్కున్న మొసలిని చూడగానే.. ఈ పులి ఏం చేసిందో చూడండి..

వరుడు తన జేబులోంచి కరెన్సీ నోట్లు బయటికి తీసి, తన అందమైన భార్యకు దిష్టి తీస్తాడు. ఆ సమయంలో అతడి అనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అందమైన వధువుకు నల్లటి వరుడు రావడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడు’’.., ‘‘విధి ఎంత విచిత్రమైనది’’.., ‘‘ఇది గవర్నమెంట్ ఫవర్ అంటే’’.. అంటూ కొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఓ వైపు పిల్లాడి మొండి పట్టు.. మరోవైపు పట్టు వదలని జిరాఫీ.. చివరకు చూస్తే..

Updated Date - Feb 03 , 2024 | 06:43 PM