Share News

Viral Video: ఉన్నట్టుండి బరువెక్కిన ఫ్యాన్.. ఏంటా అని పైకి చూడగా.. దిమ్మతిరిగే సీన్..

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:15 PM

ఎంత మన ఇంట్లోని వస్తువులే అయినా.. వాడే ముందు అప్పుడప్పుడూ వాటిని పూర్తిగా పరిశీలించడం బెటర్. ముందూ వెనుకూ చూసుకోకుండా వెళ్లి ముట్టుకుంటే.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు సంబంవించవచ్చు. ఫ్రిడ్జ్ డోరు తెరుద్దామని వెళ్తే..

Viral Video: ఉన్నట్టుండి బరువెక్కిన ఫ్యాన్.. ఏంటా అని పైకి చూడగా.. దిమ్మతిరిగే సీన్..
ప్రతీకాత్మక చిత్రం

ఎంత మన ఇంట్లోని వస్తువులే అయినా.. వాడే ముందు అప్పుడప్పుడూ వాటిని పూర్తిగా పరిశీలించడం బెటర్. ముందూ వెనుకూ చూసుకోకుండా వెళ్లి ముట్టుకుంటే.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు సంబంవించవచ్చు. ఫ్రిడ్జ్ డోరు తెరుద్దామని వెళ్తే.. దాని కింద నంచి పాములు రావడం, అలాగే తీరా తలుపు తీసే ముందు నాగుపాము బుసలు కొట్టడం వంటి ఘటనలను చాలా చూశాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్ ఉన్నట్టుండి బరువెక్కింది. ఏంటా అని పైన పరిశీలించడగా.. షాకింగ్ దృశ్యం కంటపడింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లగానే రోజూ మాదిరే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు. అయితే రోజూ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్.. ఆ రోజు మాత్రం ఎంతో బరువుగా తిరుగుతూ ఉంది. దీంతో ఏంటా.. అని పైకి చూడగా.. (Cobra on the fan) ఓ పెద్ద నాగుపాము కనిపించింది. ఫ్యాన్‌పై చుట్టు చుట్టుకుని ఉన్న పాము బుసలు కొడుతూ కనిపించింది. దాన్ని చూడగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Viral: కొంపముంచిన జీపీఎస్.. స్నేహితుడిని కలవడానికి కారులో వెళ్తున్న యువతి.. చివరకు మార్గమధ్యలో..

snake-viral-video.jpg

చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి.. దాన్ని పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! పైనుంచి మనుషుల పడితే ఏంటి పరిస్థితి’’.., ‘‘ఈ పాముకు ఫ్యాన్ అంటే ఇష్టమేమో’’.., ‘‘ఫ్యాన్‌పై విశ్రాంతి తీసుకుంటున్నా పాము’’.., ‘‘నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా.. అనుకున్నట్లు ఉంది’’.., ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. ఇలా కొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 61వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: పెళ్లయిన మొదటి రాత్రి నుంచే మహిళకు వింత కష్టం.. 12 ఏళ్లుగా భర్త చేసిన దారుణం తెలుసుకుని అంతా షాక్..

Updated Date - Feb 02 , 2024 | 04:15 PM