Share News

Wife: పెళ్లయిన మొదటి రాత్రి నుంచే మహిళకు వింత కష్టం.. 12 ఏళ్లుగా భర్త చేసిన దారుణం తెలుసుకుని అంతా షాక్..

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:09 PM

మహిళలు నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు ఆకతాయిల లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు ఏకంగా వారి కుటుంబ సభ్యుల కారణంగానే అవస్థలు పడుతుంటారు. తాజాగా...

Wife: పెళ్లయిన మొదటి రాత్రి నుంచే మహిళకు వింత కష్టం.. 12 ఏళ్లుగా భర్త చేసిన దారుణం తెలుసుకుని అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

మహిళలు నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు ఆకతాయిల లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు ఏకంగా వారి కుటుంబ సభ్యుల కారణంగానే అవస్థలు పడుతుంటారు. తాజాగా, ఓ మహిళకు ఎవరికీ రాని కష్టం వచ్చింది. పెళ్లయిన మొదటి రాత్రి నుంచే భర్త రూపంలో సమస్యలు మొదలయ్యాయి. చివరకు 12 ఏళ్ల పాటు భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కర్ణాటక (Karnataka) మైసూర్ జిల్లాలోని హిరేగే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సన్నలయ్య అనే వ్యక్తి.. కొన్నేళ్ల కిందట సుమ అనే యువతిని మూడో వివాహం (Third marriage) చేసుకున్నాడు. అయితే వివాహమైన కొన్ని రోజులకే సుమకు ఊహించని కష్టాలు వచ్చిపడ్డాయి. మొదటి రాత్రి తర్వాత కొన్ని రోజులకే అతను భార్యకు అనేక కండీషన్లు పెట్టాడు. ఎవరితో మాట్లాడవద్దని, అసలు ఇంట్లో నుంచే బయటికి వెళ్లొద్దని నిబంధన విధించాడు.

Viral Video: వామ్మో! వీళ్లేంట్రా.. సోయా చాప్‌ తయారీలో.. మరీ ఇంత ఘోరంగా..

అయితే కొన్నాళ్లకు ఏకంగా ఆమెను ఓ గదిలో బంధించి బయటికి వెళ్లకుండా చేశాడు. అది ఎంతలా అంటే కనీసం ఆమె తన పిల్లలను కూడా కిటికీలో నుంచే చూసుకునే విధంగా చేశాడు. మరుగుదొడ్డికి కూడా బయటికి వెళ్లకుండా చేశాడు. ఇలా సుమారు 12 ఏళ్ల పాటు ఆమెను నిర్భందించారు. ఇటీవల స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. బుధవారం రాత్రి వారి ఇంటికి వెళ్లి బాధితురాలిని రక్షించారు. పెళ్లయిన మొదటి రాత్రి నుంచే తనపై అనుమానం పెంచుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఇతడి చిత్రహింసలు తట్టుకోలేకే అతడి ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారని తేలింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఈ ఆడ సింహం ప్రేమ నటిస్తూ.. ఎలా మోసం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Feb 01 , 2024 | 08:33 PM