Share News

Viral Video: ఈ ఆడ సింహం ప్రేమ నటిస్తూ.. ఎలా మోసం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:11 PM

ప్రేమ పేరుతో కొందరు.. మనుషులను ఏమార్చి మోసం చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే...

Viral Video: ఈ ఆడ సింహం ప్రేమ నటిస్తూ.. ఎలా మోసం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ప్రేమ పేరుతో కొందరు.. మనుషులను ఏమార్చి మోసం చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే ఇలాంటి పనులు మనుషులే కాకుండా అప్పుడప్పుడూ జంతువులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి అరుదైన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహాల మధ్య చోటు చేసుకున్న తమాషా ఘటన అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో! ఈ ఆడ సింహం భలే విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మగ సింహం (male lion) పెద్ద జంతువును చంపేసి, ఓ చెట్టు కింద కూర్చుని మాంసం తింటూ ఉంటుంది. ఆ మాంసం కూడా కొంచెమే ఉంటుంది. ఇదిలావుండగా, అప్పటికే ఆకలితో ఉన్న ఆడ సింహం.. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి మాంసం తింటున్న మగ సింహం కనిపిస్తుంది. మాంసాన్ని చూడగానే ఆడ సింహానికి (Female Lion) నోరూరిపోతుంది. వెంటనే దాని వద్దకు వెళ్లి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. మగ సింహం కూడా ఆడ సింహాన్ని అంతే ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది.

ఫ్రిడ్జ్‌లో.. ఈ 4 పదార్థాలను మాత్రం పెట్టొద్దు..

అయితే ఈ క్రమంలో మగ సింహాన్ని ఏమార్చిన ఆడ సింహం.. మాంసాన్ని నోట కరుచుకుని పారిపోతుంది. దీంతో మగ సింహం ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే తేరుకుని దాని వెనుకే పరుగెత్తి.. మాంసాన్ని మళ్లీ వెనక్కు లాక్కుంటుంది. ‘‘ప్రేమగా నటిస్తూ.. చివరకు మోసం చేస్తావా.. ఇంకోసారి ఇటు వైపు వచ్చావో ప్రాణం తీస్తా’’.. అన్నట్లుగా దాని వైపు కోపంగా చూస్తుంది. ఈ సరదా సంఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆ ఆడసింహం సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్లు ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా దారుణమైన మోసం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం 32వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పందిని కెలికి పెద్ద తప్పే చేసింది.. చివరకు చుక్కలు చూపించిందిగా..

Updated Date - Feb 01 , 2024 | 04:11 PM