Share News

Viral Video: పట్టపగలే యువతికి షాక్ ఇచ్చిన పక్షి.. అంతా చూస్తుండగా.. పర్సు కొట్టేసి.. చివరకు..

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:24 PM

కొన్ని దొంగతనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలామంది దొంగలు చాలా తెలివిగా చోరీలకు పాల్పడుంటారు. ఇంకొన్ని దొంగతనాలు చూస్తే.. ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. మనుషులు చోరీలు చేయడం సాధరణమే.. కానీ..

Viral Video: పట్టపగలే యువతికి షాక్ ఇచ్చిన పక్షి.. అంతా చూస్తుండగా.. పర్సు కొట్టేసి.. చివరకు..

కొన్ని దొంగతనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలామంది దొంగలు చాలా తెలివిగా చోరీలకు పాల్పడుంటారు. ఇంకొన్ని దొంగతనాలు చూస్తే.. ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. మనుషులు చోరీలు చేయడం సాధరణమే.. కానీ పక్షులు, జంతువులు చోరీలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం ఇలాంటి అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతా చూస్తుండగానే.. ఓ పక్షి చోరీకి పాల్పడింది. మహిళ పర్సు ఎత్తుకెళ్లి చివరకు ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఎత్తైన నిర్మాణంపై ఉన్న ఖాళీ ప్రదేశంలోని మెట్లపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆమె తన ఫొన్, పర్సు తదితరాలను కాస్త దూరంలో మెట్లపైనే ఉంచుతుంది. చాలా సేపటి నుంచి యువతిని గమనిస్తున్న ఓ పక్షి అదును చూసి సమీపానికి వెళ్తుంది. యువతి ఏమరపాటులో ఉన్న సమయంలో మెల్లగా ఆమె వస్తువుల వద్దకు వెళ్తుంది. వీటిలో దేన్ని ఎత్తుకెళ్లాలబ్బా.. అన్నట్లుగా కొద్ది సేపు ఆలోచిస్తుంది. ‘‘డబ్బులు ఉంటే అలాంటివన్నీ కొనుక్కోవచ్చు’’ .. అని అనుకుందో ఏమో గానీ.. చివరకు పర్సును సెలెక్ట్ చేసుకుంటుంది.

Viral Video: రోజూ హెల్మెట్ వాడుతుంటారా.. ఈ వీడియో చూశారంటే.. ఖంగుతింటారు..

పర్సును ఎంచుకోగానే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్సును నోట కరుచుకుని అక్కడి నుంచి తుర్రుమంటుంది. పక్షి పర్సు ఎత్తుకెళ్లడాన్ని గమనించిన యువతి.. ‘‘వామ్మో!.. నా పర్సు’’.. అంటూ కేకలు పెడుతూ దాని వెంటే పరుగెడుతుంది. అయితే అప్పటికే పక్షి రివ్వున ఎగిరిపోవడంతో.. చేసేదేమీ లేక అలాగే బాధతో చూస్తుండిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్!.. ఈ పక్షి భలే కిలాడీగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది దొంగ పక్షి’’.. అంటూ మరికొందరు, ‘‘దీనికెవరో బాగానే ట్రైనింగ్ ఇచ్చారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: భయపెట్టాలని చూసిన కోతి.. అయినా చలించని వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jan 30 , 2024 | 04:24 PM