Share News

Viral Video: ఎలాగైనా బతకాలన్న ఒకే ఒక్క కోరికతో.. ఈ పంది చివరకు పెద్ద సాహసమే చేసిందిగా..

ABN , Publish Date - Jan 28 , 2024 | 05:38 PM

మనుషులే కాదు.. జంతువులైనా.. ప్రాణం మీదకు రానంత వరకు మామూలుగానే ఉంటాయి. కానీ వాటి ప్రాణాలకే ముప్పు వస్తుందని తెలిస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తాయి. ఈ క్రమంలో అవి చేసే సాహసాలు చూసేందుకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు...

Viral Video: ఎలాగైనా బతకాలన్న ఒకే ఒక్క కోరికతో.. ఈ పంది చివరకు పెద్ద సాహసమే చేసిందిగా..

మనుషులే కాదు.. జంతువులైనా.. ప్రాణం మీదకు రానంత వరకు మామూలుగానే ఉంటాయి. కానీ వాటి ప్రాణాలకే ముప్పు వస్తుందని తెలిస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తాయి. ఈ క్రమంలో అవి చేసే సాహసాలు చూసేందుకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని జంతువులు బతుకుపోరాటంలో పులులు, సింహాలతో పోరాడి గెలవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పందికి విచిత్ర సమస్య వచ్చి పడింది. వ్యాపారులు ఓ పందిని కబేళాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో ఆ పంది.. ఎలాగైనా బతకాలనే ఉద్దేశంతో చివరకు పెద్ద సాహసమే చేసింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారులో వెళ్తున్న కొందరికి ఎదురుగా వెళ్తున్న ట్రక్కులో షాకింగ్ సీన్ కనిపించింది. కొందరు ఓ ట్రక్కులో పెద్ద పందిని (pig) కబేళాలకు తీసుకెళ్తున్నారు. అయితే పంది మాత్రం ఎలాగైనా బతకాలన్న ఆశతోనే ఉంది. ఏమాత్రం అవకాశం దొరికినా తప్పించుకోవాలని చూస్తోంది. అయితే అది సాధ్యం కాలేదు. దాన్ని ట్రక్కు వెనుక వైపు పడేసి, వేగంగా వెళ్తున్నారు. అయినా పందికి మాత్రం బతుకుపై ఆశ ఉంది. కానీ అప్పటికీ దానికి ఎలాంటి ఐడియా రాలేదు. ఇలాగైతే తన ప్రాణాలు పోయాయని అనుకుందే ఏమో.. గానీ చివరకు తెగించింది.

Viral Video: రోడ్డుపై రిక్షాను చూసి పరుగెత్తుకుంటూ వెళ్లిన పోలీసు.. చివరకు ఎంత పని చేశాడంటే..

ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రక్కు పైనుంచి అమాంతం ( pig jumped from the top of the truck) కిందకు దూకేసింది. ట్రక్కు వేగంగా వెళ్తుండడంతో ఆ వేగానికి కింద పడ్డ పంది.. పల్టీలు కొట్టుకుంటూ చివరకు ఎలాగోలా పైకి లేచి నిలబడింది. ‘‘హమ్మయ్య! మొత్తానికి ఎలాంటి గాయాలూ కాకుండా బయటపడ్డా’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఈ ఘటన మొత్తం కారులో వెళ్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పంది పెద్ద సాహసమే చేసిందే’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి భలే తప్పించుకుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! చివరకు ఇలా అయ్యిందేంటీ.. గడ్డకట్టే చలిలో వేడి వేడి న్యూడిల్స్‌తో వింత ప్రయోగం..

Updated Date - Jan 28 , 2024 | 05:38 PM