Share News

Viral Video: పిల్లను కాపాడుకునేందుకు కొండచిలువతో కంగారూ ఫైట్.. చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం..

ABN , Publish Date - Jan 27 , 2024 | 03:58 PM

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. పిల్లలపై తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. పిల్లలకు ఆపద వస్తే తల్లి తల్లిడిల్లిపోతుంది. వారిని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంది. జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటాయి. ఈ క్రమంలో...

Viral Video: పిల్లను కాపాడుకునేందుకు కొండచిలువతో కంగారూ ఫైట్.. చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం..

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. పిల్లలపై తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. పిల్లలకు ఆపద వస్తే తల్లి తల్లిడిల్లిపోతుంది. వారిని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంది. జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటాయి. ఈ క్రమంలో ఎదురుగా ఉన్నది.. ఎవరైనా లెక్కచేయదు. చివరకు పిల్లల ప్రాణాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయవు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కంగారూ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తన పిల్లను కాపాడుకునేందుకు కంగారూ ఏకంగా కొండచిలువతోనే ఫైట్ చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని కంగారూలు మేత మేస్తూ ఉండగా.. వాటిని ఓ కొండచిలువ టార్గెట్ చేస్తుంది. అదును చూసి ఓ పిల్ల కంగారూపై దాడి చేస్తుంది. కంగారూను చుట్టేసి (Python attack on kangaroo) తినేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు తన పిల్ల కనిపించకపోవడంతో తల్లి కంగారూ వెతుకుతూ ఉంటుంది. చివరకు కొండచిలువ దాడి చేయడాన్ని చూసి పరుగు పరుగున అక్కడికి చేరుకుంటుంది. తన పిల్లను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొండ చిలువను కొరికి పక్కకు లాగాలని చూస్తుంది.

Optical illusion: ఈ గదిలో ఆపిల్ పండు ఎక్కడుందో కనుక్కుంటే.. మీ చూపు పదునుగా ఉన్నట్లే..

అయినా కొండచిలువ మాత్రం పట్టు విడకుండా పిల్ల కంగారూను గట్టిగా చుట్టేస్తుంది. తన పిల్లను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో తల్లి కంగారూ కూడా కొండచిలువతో పోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే.. తల్లి కంగారు దెబ్బకి కొండచిలువ తోక ముడిచినట్లుగా కనిపిస్తోంది. కాగా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి కంగారూను చూస్తుంటే బాధేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది బైకు లాంటి సైకిల్.. ఈ పెద్దాయన తెలివితేటలు చూస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు..

Updated Date - Jan 27 , 2024 | 03:58 PM