Share News

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

ABN , Publish Date - Jan 25 , 2024 | 08:43 PM

ప్రార్థించే పెదవుల కంటే.. సాయం చేసే చేతులు మిన్న.. అన్న సామెత చందంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం అనేది చాలా ఎంతో గొప్ప విషయం. కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో తమ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప.. ఎవరు ఏమైపోయినా ....

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

ప్రార్థించే పెదవుల కంటే.. సాయం చేసే చేతులు మిన్న.. అన్న సామెత చందంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం అనేది చాలా ఎంతో గొప్ప విషయం. కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో తమ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప.. ఎవరు ఏమైపోయినా మాకేమీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొన్నిసార్లు చిన్న పిల్లలు ఆశ్చర్యకర పనులు చేస్తూ పెద్దల కళ్లు తెరిపిస్తుంటారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయోధ్యలో ఓ పిల్లాడు చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతా రామభక్తిలో ఉండగా.. ఓ పిల్లాడు మాత్రం కుక్క పిల్లలకు సాయం చేసి మానవత్వం అంటే ఏంటో చూపించాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సరయూ నది ఒడ్డున భక్తులంతా స్నానాలు చేసిన అనంతరం రాముడిని దర్శించుకుంటున్నారు. అయితే ఆ సమయంలో నది ఒడ్డున ఓ చిన్నపిల్లాడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుడి బుడి అడుగులు వేసే ఓ పిల్లాడు.. నడి ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో బాలుడు ఓ కుక్క పిల్లను చూసి దగ్గరికి వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. దాంతో ఆడుకుంటున్నాడని అంతా అనుకున్నారు. కానీ అతను కుక్క పిల్లను ఎత్తుకుని అతి కష్టం మీద అక్కడున్న మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటాడు.

Wedding Card : నెట్టింట వైరల్ అవుతున్న డాక్టర్, సోల్జర్.. పెళ్లిలోనూ వీళ్ల మార్క్ మిస్ అవ్వలేదుగా ...

పిల్లాడు ఎక్కడికి వెళ్తున్నాడబ్బా.. అని అంతా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే కుక్కపిల్లను పైకి తీసుకెళ్లిన బాలుడు.. దాన్ని తన తల్లి వద్ద వదిలేస్తాడు. అలాగే అక్కడే ఉన్న మరో కుక్క పిల్లను సైతం తల్లి కుక్క పాలు తాగేలా వదిలి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంత చిన్న వయసులో కుక్క పిల్ల ఆకలి తెలుసుకుని సాయం చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లాడిది ఎంత మంచి బుద్ధి’’.. అంటూ కొందరు, ‘‘ఈ బుడ్డోడిని చూసి ఎంతో నేర్చకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘వయసు చిన్నదే కానీ.. మనసు ఎంతో పెద్దది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

AI Technology: మృతదేహం కళ్లు తెరిపించిన ఏఐ.. చివరకు నేరస్థులు ఎలా దొరికిపోయారంటే..

Updated Date - Jan 26 , 2024 | 12:51 PM