Share News

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్ పైనే ప్రేమాయణం.. జంట వికృత చేష్టలకు అవాక్కయిన ప్రయాణికులు..

ABN , Publish Date - Jan 24 , 2024 | 09:04 PM

రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. రీల్స్ కోసం కొందరు, అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో మరికొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో...

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్ పైనే ప్రేమాయణం.. జంట వికృత చేష్టలకు అవాక్కయిన ప్రయాణికులు..

రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. రీల్స్ కోసం కొందరు, అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో మరికొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొందరైతే హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ జంట రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ పైనే ప్రేమాయణం సాగించింది. వీరి చేష్టలు చూసి ప్రయాణికులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో (Delhi Metro) ఇటీవల ప్రేమికులకు వేదికగా మారిపోయింది. ఇటీవల చాలా మంది ప్రేమికులు మెట్రో స్టేషన్‌లో (Metro station) సరసాలు ఆడుకోవడం షరామామూలు అయింది. గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌లో ఓ జంట అసభ్యకరంగా (couple Indecent behavior) ప్రవర్తించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి తన ప్రియురాలిని పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..

అంతా చూస్తుండగానే ఆమెను బలవంతంగా పట్టుకుని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేశాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న వారిని గమనించిన ప్రియురాలు.. అతడికి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించింది. అయినా అతను మాత్రం ఆమెను దగ్గరకు లాక్కుంటూ ముద్దులు పెట్టడం కనిపించింది. అక్కడున్న ప్రయాణికులు ఈ ఘటనను చూసి అవాక్కయ్యారు. కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘రైల్వే స్టేషన్లను పార్కులుగా మార్చుతున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు పాడుబడిన మరుగుదొడ్లే.. కానీ వాటి వెనుకకు వెళ్లి చూడగా.. దిమ్మతిరిగే దృశ్యం..

Updated Date - Jan 24 , 2024 | 09:04 PM