Share News

Viral Video: మొత్తానికి కోతితోనే డీల్ కుదుర్చుకున్నాడుగా.. పది రూపాయల పండు ఇచ్చి..

ABN , Publish Date - Jan 21 , 2024 | 09:51 PM

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి కంట ఏది పడ్డా దాన్ని తీసుకునేవరకూ నిద్రపోవు. ఏదైనా ఒక్కసారి వాటి చేతిలోకి వెళ్లిందంటే ఇక వెనక్కు తిరిగి రావడం చాలా కష్టం. పండు అయితే...

Viral Video: మొత్తానికి కోతితోనే డీల్ కుదుర్చుకున్నాడుగా.. పది రూపాయల పండు ఇచ్చి..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి కంట ఏది పడ్డా దాన్ని తీసుకునేవరకూ నిద్రపోవు. ఏదైనా ఒక్కసారి వాటి చేతిలోకి వెళ్లిందంటే ఇక వెనక్కు తిరిగి రావడం చాలా కష్టం. పండు అయితే తినేయడమో, వస్తువు అయితే ఎత్తుకెళ్లి ధ్వంసం చేయడమో, ఏ చెట్ల పొదల్లో పడేయడమో చేస్తుంటాయి. పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఐ ఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లింది. అయితే కోతి నుంచి ఫోన్‌ను ఎంతో తెలివిగా తిరిగి తీసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘సూపర్ ఐడియా సర్జీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మధుర బృందావనం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది పర్యాటకులు అక్కడి ప్రదేశాలను వీక్షిస్తూ ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కోతి వారి వద్దకు వచ్చి.. ఓ వ్యక్తి చేతిలోని ఐ ఫోన్‌ను (i phone) లాక్కుని వెళ్లి పెద్ద గోడపై కూర్చుంది. సడన్‌గా కోతి ఇలా చేయడంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. తన ఫోన్ తీసుకునేందుకు నానా తంటాలూ పడ్డాడు. అయినా కోతి మాత్రం ఫోన్ పట్టుకుని ‘‘ఇచ్చేదే లేదు.. ఏం చేసుకుంటావో.. చేసుకో’’.. అన్నట్లుగా ధీమాగా కూర్చుని ఉంటుంది. దాన్నుంచి ఫోన్‌ను తిరిగి తీసుకునేందుకు అతడు చేయని ప్రయత్నం అంటూ లేదు.

Optical illusion: ఇక్కడున్న వందలాది రొట్టెల మధ్య పిల్లి దాక్కుని ఉంది.. 7 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

అయితే చివరకు అతడికి ఓ బంపర్ ఐడియా వస్తుంది. వస్తు మార్పిడి పద్ధతిలో కోతికి ఎర వేస్తాడు. దానికి ఇష్టమైన పండు తీసుకుని పైకి ఎగురవేస్తాడు. పండును చూడగానే కోతి ‘‘ఈ డీల్ నాకు ఓకే’’.. అన్నట్లుగా వెంటనే పండును క్యాచ్ పట్టుకుని ఫోన్‌ను వదిలేస్తుంది. కింద పడుతున్న ఫోన్‌ను తీసుకున్న ఆ వ్యక్తి.. హమ్మయ్య! అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి లంచాలకు బాగా అలవాటు పడింది’’.. అంటూ కొందరు, ‘‘ఇది బ్లాక్‌మెయిల్ కోతిలా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: విమానంలో ఆకతాయి నీచపు పని.. ఎయిర్‌హోస్టెస్‌కు తెలీకుండా వెనుక నుంచి..

Updated Date - Jan 21 , 2024 | 09:51 PM