Share News

Viral Video: రన్నింగ్ ట్రైన్‌పై యువకుడి ఓవరాక్షన్.. స్టంట్ చేస్తుండగా..

ABN , Publish Date - Jan 27 , 2024 | 09:58 PM

రైలు ప్రయాణాల్లో కొందరు ఆకతాయిలు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ప్రమాదమని తెలిసి కూడా వీడియోల్లో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో

Viral Video: రన్నింగ్ ట్రైన్‌పై యువకుడి ఓవరాక్షన్.. స్టంట్ చేస్తుండగా..

రైలు ప్రయాణాల్లో కొందరు ఆకతాయిలు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ప్రమాదమని తెలిసి కూడా వీడియోల్లో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్‌పై ఓవరాక్షన్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వేగంగా వెళ్తున్న రైల్లో ఓ యువకుడు (man performs dangerous stunts on train) ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమవుతాడు. ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా.. మరో యువకుడు డోరు నుంచి బయటికి వెళ్లి.. బోగీ పైకి ఎక్కేస్తాడు. ఈ క్రమంలో కొద్ది సేపు చేతులు అటూ ఇటూ తిప్పుతూ విన్యాసాలు చేస్తాడు. పట్టాల పక్కనే ఉన్న స్తంభాలకు సమీపంగా వెళ్తాడు. తర్వాత పూర్తిగా బోగీ పైకి ఎక్కేస్తాడు.

Viral: పేషెంట్‌ను పరీక్షించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న డాక్టర్.. వెనక్కు తిరిగి చూసేలోపే.. షాక్ ఇచ్చిన రోగి..

చివరకు రైలు బోగీ పైకి ఎక్కి నిలబడి చేతులు ఊపుతూ ఫోజులు ఇస్తాడు. ఈ క్రమంలో చేతులు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్ కొట్టి.. ధబేల్‌మని రైలుపై పడిపోతాడు. ఈ ప్రమాదంలో అతను అదృష్టవశాత్తు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలంటే కొంచెం కూడా లెక్క లేనట్లు ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఈ 10 పక్షులు యమా డేంజర్.. పాములను కూడా తినగలవు..

Updated Date - Jan 27 , 2024 | 09:58 PM