Share News

Viral Video: పందిని కెలికి పెద్ద తప్పే చేసింది.. చివరకు చుక్కలు చూపించిందిగా..

ABN , Publish Date - Jan 31 , 2024 | 10:00 PM

పులి పంజా దెబ్బకు మిగతా జంతువులన్నీ విలవిలలాడిపోతాయి. దెబ్బకు పులికి ఆహారమవుతాయనడంతో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్నిసార్లు...

Viral Video: పందిని కెలికి పెద్ద తప్పే చేసింది.. చివరకు చుక్కలు చూపించిందిగా..

పులి పంజా దెబ్బకు మిగతా జంతువులన్నీ విలవిలలాడిపోతాయి. దెబ్బకు పులికి ఆహారమవుతాయనడంతో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్నిసార్లు అయితే మరీ చిన్న చిన్న జంతువుల చేతిలోనూ ఘోరంగా ఓడిపోతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పందిని టార్గెట్ చేసిన పులి... తినేయాలని ప్రయత్నిస్తుంది. అయితే చివరకు కథ కడ్డం తిరుగుతుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పులి ఆహార వేటలో భాగంగా పెద్ద అడవి పందిని టార్గెట్ చేస్తుంది. ఓ వారానికి సరిపడా ఆహారానికి ఇబ్బంది లేదు అని అనుకునుకుంటూ నేరుగా (Tiger attack on wild pig) దానిపై దాడికి దిగింది. పులి పంజా విసరగానే పంది ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతలోనే పులి.. పంది మెడను పట్టుకుంది. అయితే పంది కూడా ఎలాగైనా తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో పులిని సైతం పక్కకు లాక్కుంటూ వెళ్లింది. పులి కూడా పందిని గట్టిగా పట్టుకుని చంపేయాలని చూసింది.

Viral: ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో..

అయితే పంది బతుకు పోరాటం ముందు పులి ఓడిపోయింది. చివరకు పంది దెబ్బకు పులి నేలపై పడిపోయింది. పట్టు సడటించడంతో పంది ఈజీగా తప్పించుకుంది. ఇలా పంది బతుకుపోరాటం ముందు పులి ఓడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పంది చాలా పవర్ ఫుల్’’.. అంటూ కొందరు, ‘‘పులికి చుక్కలు చూపించిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

పులులు, సింహాల కంటే.. ఈ 10 జీవులే ప్రమాదం..

Updated Date - Jan 31 , 2024 | 10:00 PM