Share News

Viral Video: సింహానికి చిక్కిన గేదెల మంద.. దొరికిపోతాయనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్..

ABN , Publish Date - Jan 30 , 2024 | 06:24 PM

అడవికి రాజుగా పిలవడబడే సింహం.. పేరుకు తగ్గట్టుగానే అన్ని జంతువులనూ హడలెత్తిస్తుంటుంది. ఒకసారి వేటకు దిగిందంటే ఎలాంటి జంతువైనా మట్టి కరవాల్సిందే. వారానికి సరిపడా ఆహారాన్ని ఒకేసారి సమకూర్చుకుంటుంటాయి. అయితే...

Viral Video: సింహానికి చిక్కిన గేదెల మంద.. దొరికిపోతాయనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్..

అడవికి రాజుగా పిలవడబడే సింహం.. పేరుకు తగ్గట్టుగానే అన్ని జంతువులనూ హడలెత్తిస్తుంటుంది. ఒకసారి వేటకు దిగిందంటే ఎలాంటి జంతువైనా మట్టి కరవాల్సిందే. వారానికి సరిపడా ఆహారాన్ని ఒకేసారి సమకూర్చుకుంటుంటాయి. అయితే అన్నిసార్లూ ఇలాగే ఉంటుందంటే.. ఉండదనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు సింహాలకూ ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఆవేశంగా వేటకు వెళ్లి తోక ముడుచుకుని తిరిగిరావాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ఏకంగా ప్రాణాలో పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంటుంటుంది. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సింహానికి గేదెల మంద చిక్కింది. దొరికిపోతాయనుకున్న సమయంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో దానికి ఓ గేదెల మంద కనిపిస్తుంది. ఎలాగైనా వాటిలో ఓ గేదెను పట్టుకోవాలని ప్లాన్ వేసింది. పొదల మాటున దాక్కుని ఒక్కసారిగా వాటి పైకి పంజా విసిరింది. ఒక్కసారిగా సింహం (Lion attack on buffalo) మీద పడడంతో గేదెలన్నీ భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి. అయినా వదలకండా సింహం వాటిని వెంబడించింది.

Viral Video: పట్టపగలే యువతికి షాక్ ఇచ్చిన పక్షి.. అంతా చూస్తుండగా.. పర్సు కొట్టేసి.. చివరకు..

అయితే తీరా గేదెపై పంజా విసిరే సమయంలో అన్ని గేదెలు ఒక్కటై తిరగబడ్డాయి. ఒకదాని తర్వాత ఒకటిగా సింహాన్ని కొమ్ములతో ఎత్తిపడేశాయి. ఇలా గేదెలన్నీ కలిసి పలుమార్లు దానిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అసలే వృద్ధ సింహం కావడంతో చివరకు వాటి చేతిలో తోక ముడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికే చుక్కలు చూపించాయిగా’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలకు తెగించి పోరాడాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భయపెట్టాలని చూసిన కోతి.. అయినా చలించని వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jan 30 , 2024 | 06:25 PM