Share News

Viral Video: ఒంటరిగా ఉన్న ఈ కాకి.. పార్కులో చేస్తున్న పనులు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:58 PM

మనుషులతో పాటూ జంతువులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిచండం చూస్తూ ఉంటాం. అయితే అప్పుడప్పుడూ పక్షులు కూడా విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: ఒంటరిగా ఉన్న ఈ కాకి.. పార్కులో చేస్తున్న పనులు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

మనుషులతో పాటూ జంతువులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిచండం చూస్తూ ఉంటాం. అయితే అప్పుడప్పుడూ పక్షులు కూడా విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కాకి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్క్‌లో ఒంటరిగా ఉన్న ఓ కాకి.. అందరినీ ఆశ్చర్యపరిచేలా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కాకి ఎంతో వెరైటీగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కాకి పార్క్‌లో ఒంటరిగా ఉంది. దాని సహచర కాకుల కోసం చాలా సేపు ఎదురుచూసింది. ఆ సమయంలో ఏ కాకీ అక్కడికి రాకపోవడంతో అది చాలా బోర్ ఫీలైంది. ‘‘టైం పాస్ చేయడానికి ఏం చేయాలబ్బా’’.. అని అనుకుందే ఏమో గానీ.. వెంటనే దానికి ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. కాకి కాస్త వెంటనే చిన్న పిల్లాడిలా మారిపోయింది. అక్కడే ఉన్న ఊగుడు బల్ల ఎక్కింది. అయితే ఈ ఆట ఆడేందుకు మరో కాకి అవసరం ఉంది.

Viral Video: ఇదెక్కడి ప్రేమరా నాయనా.. పక్కా ప్లాన్ ప్రకారం స్నేహితులను పిలిపించి మరీ..

తోలి కాకులు లేకున్నా కూడా... తానొక్కటే ఊగుడు బల్ల ఆడాలని ఫిక్స్ అయింది. దీంతో బల్లకు ఓ వైపు కొద్ది సేపు, మరోవైపు కొద్ది సేపు.. ఇలా బల్లపై అటూ ఇటూ తిరుగూతూ ఆటాడుకుంది. ఆ కాకి ఈ ఆట చాలా సేపు అలా ఆడుతూనే ఉంది. అక్కడే ఉన్న కొందరు ఈ కాకిని చూసి అవాక్కయ్యారు. వెంటనే తమ ఫోన్లలో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లల ఆటలంటే ఈ కాకికి ఇష్టమేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ కాకి చాలా సిల్లీగా ఉన్నట్టుందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: మీ కంటి చూపు బాగుంటే.. ఈ చిత్రంలో గెలీలియో ఎక్కడున్నాడో.. 10సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Updated Date - Jan 31 , 2024 | 04:58 PM