Share News

Viral Video: ముంబై మెట్రోలో.. రవీనా టాండన్‌ ఊహించని సర్‌ప్రైజ్..

ABN , Publish Date - Feb 01 , 2024 | 05:53 PM

సోషల్ మీడియాలో ముంబై మెట్రోకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా నిత్యం ప్రయాణికులతో రద్దీగా లోకల్ ట్రైన్స్‌లో రోజూ ఏదో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే..

Viral Video: ముంబై మెట్రోలో.. రవీనా టాండన్‌ ఊహించని సర్‌ప్రైజ్..

సోషల్ మీడియాలో ముంబై మెట్రోకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా నిత్యం ప్రయాణికులతో రద్దీగా లోకల్ ట్రైన్స్‌లో రోజూ ఏదో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్.. మెట్రో స్టేషన్‌లో తళుక్కున మెరిసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఊహించని ఈ ఘటనతో మెట్రో సిబ్బందితో పాటూ అభిమానులంతా ఆమెను చుట్టుముట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రవీనా టాండన్‌ (Raveena Tandon) ప్రధాన పాత్ర పోషించిన ‘కర్మ కాలింగ్‌’ అనే వెబ్‌సిరీస్‌ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ కథ ముంబై నేపథ్యంలో జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రవీనా టాండన్ ట్రెండింగ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ముంబై మెట్రో స్టేషన్‌కు (Mumbai Metro Station) వెళ్లి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

Viral Video: పందిని కెలికి పెద్ద తప్పే చేసింది.. చివరకు చుక్కలు చూపించిందిగా..

రవీనా ఉన్నట్టుండి మెట్రో స్టేషన్‌లోకి ఎంటరవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆమె చుట్టూ గుమికూడారు. స్టైలిష్ లుక్‌లో వచ్చిన రవీనా చూసి.. చివరికి మెట్రో సిబ్బంది కూడా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఆమె కూడా చాలా ఓపిగ్గా అభిమానుందరినీ పలకరించి ఫొటోలు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నాలుగు వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఆడ సింహం ప్రేమ నటిస్తూ.. ఎలా మోసం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Feb 01 , 2024 | 06:33 PM