Share News

Viral Video: చుట్టూ ఐదు కుక్కలు, మధ్యలో భారీ నాగు పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - Feb 02 , 2024 | 05:27 PM

సాధారణంగా మనుషులతో పాటూ జంతువులు కూడా పాముల జోలికి వెళ్లేందుకు భయపడుతుంటాయి. అయితే కుక్కలు, కోతులు వంటి జంతువులు కొన్నిసార్లు వాటితో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం, అలాగే ..

Viral Video: చుట్టూ ఐదు కుక్కలు, మధ్యలో భారీ నాగు పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

సాధారణంగా మనుషులతో పాటూ జంతువులు కూడా పాముల జోలికి వెళ్లేందుకు భయపడుతుంటాయి. అయితే కుక్కలు, కోతులు వంటి జంతువులు కొన్నిసార్లు వాటితో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం, అలాగే మరికొన్నిసార్లు ఏకంగా వాటిని చంపేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కుక్కలతో పాము పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ భారీ నాగుపామును ఐదు కుక్కలు చుట్టుముట్టాయి. చివరికి ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న కుక్కలకు ఓ భారీ నాగుపాము (Cobra) ఎదురుపడుతుంది. దీంతో వెంటనే అక్కడున్న ఐదు కుక్కలూ కలిసి దానిపైకి యుద్ధానికి దిగుతాయి. ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేస్తాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు పాము కూడా ఎంతో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వాటిపై కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా కుక్కలు మాత్రం వెనక్కు తగ్గకుండా పామును అటూ, ఇటూ తిప్పుతూ తికమకపెడుతుంటాయి. కొన్ని కుక్కలు దాని దృష్టి మళ్లిస్తుంటే.. (Dog attack on cobra) మరికొన్ని కుక్కలు కొరికేస్తుంటాయి.

Wife: పెళ్లయిన మొదటి రాత్రి నుంచే మహిళకు వింత కష్టం.. 12 ఏళ్లుగా భర్త చేసిన దారుణం తెలుసుకుని అంతా షాక్..

ఇలా కుక్కలు, పాము మధ్య చాలా సేపు యుద్ధం జరుగుతుంది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా పాము వల్ల సాధ్యం కాలేదు. ఓ సారి వాటి నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయినా కుక్కలు పాము తోక పట్టుకుని పక్కకు లాగిమరీ దాడి చేస్తాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే కుక్కల దాడిలో పాము ప్రాణాలు కోల్పోయి ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాముపై ఐదు కుక్కలు దాడి చేయడం చూస్తుంటే బాధేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలు కాపాడుకునేందుకు తప్పదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఉన్నట్టుండి బరువెక్కిన ఫ్యాన్.. ఏంటా అని పైకి చూడగా.. దిమ్మతిరిగే సీన్..

Updated Date - Feb 02 , 2024 | 05:27 PM