Share News

Viral Video: ఓ వైపు పిల్లాడి మొండి పట్టు.. మరోవైపు పట్టు వదలని జిరాఫీ.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:53 PM

సాధారణంగానే చిన్న పిల్లలు జంతువులను తెగ ఇష్టపడుతుంటారు. ఇక వాటిని దగ్గరగా చూసినప్పుడు వారి ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే కొందరు పిల్లలు ఓ అడుగు ముందుకేసి జంతువులతో ఆటలు ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: ఓ వైపు పిల్లాడి మొండి పట్టు.. మరోవైపు పట్టు వదలని జిరాఫీ.. చివరకు చూస్తే..

సాధారణంగానే చిన్న పిల్లలు జంతువులను తెగ ఇష్టపడుతుంటారు. ఇక వాటిని దగ్గరగా చూసినప్పుడు వారి ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే కొందరు పిల్లలు ఓ అడుగు ముందుకేసి జంతువులతో ఆటలు ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బుడ్డోడు జిరాఫీకి ఆహారం పెడుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు తన తల్లిదండ్రులతో కలిసి జూలో జంతువులను చూసేందుకు వెళ్తాడు. అన్ని జంతువులూ ఆసక్తిగా గమనిస్తాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. జిరాఫీ వద్దకు వెళ్లగానే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అందరిలాగానే ఈ పిల్లాడు కూడా ( boy trying to feed giraffe) జిరాఫీకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. పిల్లాడి చేతిలో ఆహారాన్ని జిరాఫీ నోటితో పట్టుకుంటుంది. అయితే పిల్లాడు ఆహారాన్ని జిరాఫీకి వదిలేయకుండా.. అలాగే గట్టిగా పట్టుకుంటాడు. మరోవైపు ఆ ఆహారాన్ని తినేందుకు జిరాఫీ కూడా బలంగా ప్రయత్నిస్తుంది.

Viral Video: అయ్యో పాపం! స్వీటు బాక్సులు ప్యాక్ చేస్తుండగా.. ఎంత ఘోరం జరిగిందో చూడండి..

జిరాఫీ ఆ ఆహారాన్ని ఎంత గట్టిగా లాగుతున్నా పిల్లాడు మాత్రం దాన్ని వదలడు. చివరకు తన ఆహారాన్ని పైకి లాక్కునే క్రమంలో దాంతో పాటూ పిల్లాడు కూడా గాల్లోకి లేస్తాడు. అయితే పక్కనే ఉన్న తల్లిదండ్రులు.. గాల్లోకి లేచిన తమ కొడుకును ఎత్తుకుని పక్కకు తీసుకెళ్తారు. సమయానికి వారు పక్కనే ఉండడంతో బాలుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లాడి మొండి పట్టు మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! సమయానికి తల్లిండ్రులు ఉండడం వల్ల సరిపోయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీటి ఒడ్డున షాకింగ్ దృశ్యం.. వేట కోసం దాక్కున్న మొసలిని చూడగానే.. ఈ పులి ఏం చేసిందో చూడండి..

Updated Date - Feb 03 , 2024 | 04:53 PM