Share News

Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:30 PM

బస్సులు, రైలు ప్రయాణాల్లో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కొందరు, ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో..

Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..

బస్సులు, రైలు ప్రయాణాల్లో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కొందరు, ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో మరికొందరు, రన్నింగ్ ట్రైన్లు దిగబోతూ ఇంకొందరు ప్రమాదాల బారిన పడడం కూడా చూస్తుంటాం. అయితే కొందరు మాత్రం తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చెప్పుల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Vide) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో (Bhopal Railway Station) ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఓ రైలు కదిలేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి హడావుడిగా రైలు ఎక్కబోయాడు. ఆ సమయంలో పొరపాటున (sandal dropped in the middle of the platform) తన చెప్పు ప్లాట్‌ఫామ్ మధ్యలో కిందపడింది. మరోవైపు రైలు కదిలేందుకు సిద్ధంగా ఉంటుంది. కేవలం రూ.100లు విలువ చేసే చెప్పుల కోసం అతను చివరకు ప్రాణాలతో చెలగాటం ఆటాడు.

Wife: ఎవరైనా ఇలా చేస్తారా.. పది రోజులుగా భర్త స్నానం చేయలేదని.. ఈ భార్య చేసిన నిర్వాకం..

ప్రాణాలకు తెగించి మరీ రైలుకు, ప్లాట్‌ఫామ్ మధ్యలోని ఇరుకైన సందులో కిందకు దూరిపోయాడు. కాలితో చెప్పును జాగ్రత్తగా పట్టుకుని ఎలాగోలా చివరికి పైకి తెచ్చుకున్నాడు. చెప్పును తీసుకునే క్రమంలో రైలు ఏమాత్రం ముందుకు కదిలినా పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చెప్పులు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు.. కానీ ప్రాణాలు పోతే మళ్లీ రావు బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేస్తే ప్రమాదాలు జరగవా మరి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చిపనులు ఎవరూ చేయకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

మీరు రోజూ వాడే ఈ 10 వస్తువులు.. మరుగుదొడ్డి కంటే ఘోరమని తెలుసా..?

Updated Date - Feb 06 , 2024 | 03:30 PM