Share News

Watch video: ఈ పులి నటన మామూలుగా లేదుగా.. దాహం వేసినట్లు నటిస్తూనే.. ఎలా మోసం చేసిందంటే..

ABN , Publish Date - Feb 04 , 2024 | 07:06 PM

వేటాడటంలో ఒక్కో జంతువు స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొన్ని డైరెక్ట్‌గా వేటాడితే.. ఇంకొన్ని మాటువేసి మరీ వేటను సొంతం చేసుకుంటుంటాయి. ఇక పులులు, సింహాల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి...

Watch video: ఈ పులి నటన మామూలుగా లేదుగా.. దాహం వేసినట్లు నటిస్తూనే.. ఎలా మోసం చేసిందంటే..

వేటాడటంలో ఒక్కో జంతువు స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొన్ని డైరెక్ట్‌గా వేటాడితే.. ఇంకొన్ని మాటువేసి మరీ వేటను సొంతం చేసుకుంటుంటాయి. ఇక పులులు, సింహాల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా వెంబడించి, వెంబడించి మరీ వేటాడటం వాటి స్టైల్. అయితే కొన్నిసార్లు అవి కూడా నక్క తెలివితేటలు ప్రయోగిస్తుంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ ఓ పులి వేటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో! ఈ పులి నటన మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలోని నీటి కొలను వద్ద ఓ జింక నీళ్లు తాగుతుంటుంది. అదే సమయంలో దూరం నుంచి ఓ పులి జింకను గమనిస్తుంది. కానీ తనకు ఏమీ తెలీనట్లుగా నటిస్తూ.. ఎంతో నీరసరంగా నడుచుకుంటూ వస్తుంది. పులి రావడం చూసిన జింక.. దాని పరిస్థితి చూసి.. తనను ఏమీ చేయదేమో.. అని అనికుంటుంది. పులి దగ్గరికి వచ్చిన సమయంలో కాస్త కంగారు ఉన్నా.. తన మీదకు రాదనే ధైర్యంతో ఉంటుంది. జింక సమీపానికి వచ్చే వరకూ పులి కూడా అలాగే ప్రవర్తిస్తుంది.

Viral Video: చెట్టు పైనుంచి షాక్ ఇచ్చిన భారీ కొండచిలువ.. సమీపానికి వెళ్లి చూడగా.. అది చేస్తున్న నిర్వాకం..

కానీ కాస్త దగ్గరికి రాగానే.. పులి తన అసలు స్వరూపం బయటపెడుతుంది. పరుగు పరుగున వెళ్లి (tiger attacked a deer) జింకను నోట కరుచుకుంటుంది. ఈ ఘటనను చూసిన పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పులి నటన మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘జింకను చూస్తుంటే.. జాలి కలుగుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తీన్మార్ దరువులకు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఏనుగు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Feb 04 , 2024 | 07:15 PM