Share News

Vande Bharat Train: వందే భారత్ రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తీరా పార్సిల్ తెరచి చూడగా..

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:05 PM

రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటూ ప్రయాణికులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రధానంగా సీట్ల విషయంలో, ఫుడ్ విషయంలో..

Vande Bharat Train: వందే భారత్ రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తీరా పార్సిల్ తెరచి చూడగా..

రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటూ ప్రయాణికులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రధానంగా సీట్ల విషయంలో, ఫుడ్ విషయంలో ప్రయాణికులకు అనేక సమస్యలు ఎదురవడం చూస్తుంటాం. అయితే భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అత్యాధునిక వసతులతో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అలాంటి వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఫుడ్ ఆర్డర్ చేసిన సదరు వ్యక్తి చివరకు తెరచి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది.

సోషల్ మీడియాలో వందే భారత్ రైల్లో ఫుడ్‌కు (Vande Bharat Train) సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన ఓ వ్యక్తి.. ఫిబ్రవరి 1న.. రాణికమలపాటి స్టేషన్ నుంచి జబల్‌పూర్ స్టేషన్‌కు వందేభారత్ రైల్లో బయలుదేరాడు. మార్గమధ్యలో ఆకలి వేయడంతో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఫుడ్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అందులో (Cockroach in food) చనిపోయిన బొద్దింక కనిపించింది. దాన్ని చూడగానే సదరు ప్రయాణికుడు షాక్ అయ్యాడు.

Wife: ఎవరైనా ఇలా చేస్తారా.. పది రోజులుగా భర్త స్నానం చేయలేదని.. ఈ భార్య చేసిన నిర్వాకం..

జబల్‌పూర్ స్టేషన్‌లో దిగగానే.. తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఫొటోలతో సహా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ.. సబంధిత వ్యక్తులకు భారీ జరిగినా విధించినట్లు తెలిపారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! వందేభారత్‌లో ఇలాంటి సమస్యేనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 34వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..

Updated Date - Feb 06 , 2024 | 04:06 PM