Share News

Viral Video: వంద రూపాయల హవాయి చెప్పుల తయారీ వెనుక.. ఎంత పెద్ద శ్రమ ఉందో చూడండి...

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:12 PM

ఇప్పుడంటే రకరకాల చెప్పులు.. రకారకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి కానీ.. ఒకప్పుడు హవాయి చెప్పులకు ఉన్న క్రేజే వేరు. చిన్నా పెద్దా ఎవరైనా హవాయి చెప్పులను ఎంతో ఇష్టపడేవారు. ఇప్పట్లో కూడా...

Viral Video: వంద రూపాయల హవాయి చెప్పుల తయారీ వెనుక.. ఎంత పెద్ద శ్రమ ఉందో చూడండి...

ఇప్పుడంటే రకరకాల చెప్పులు.. రకారకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి కానీ.. ఒకప్పుడు హవాయి చెప్పులకు ఉన్న క్రేజే వేరు. చిన్నా పెద్దా ఎవరైనా హవాయి చెప్పులను ఎంతో ఇష్టపడేవారు. ఇప్పట్లో కూడా చాలా మంది వాటిని ధరించడానికే ఇష్టపడుతుంటారు. అయితే ఆ చెప్పులు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల ఇలాంటి వీడియోలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, హవాయి చెప్పుల తయారీకి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వంద రూపాయల హవాయి చెప్పుల వెనుక.. ఇంత శ్రమ ఉందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో హవాయి చెప్పుల తయారీకి సంబంధించిన వీడియో (hawai chappal Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముందుగా పాత రబ్బరు వస్తువులన్నింటినీ ఓ మిషిన్‌లో పడేస్తారు. చివరకు అవన్నీ మెత్తటి ముద్దగా మారతాయి. తర్వాత దాన్ని తీసుకుని మరో యంత్రంలో వేసి, రంగును మిక్స్ చేస్తారు. ఇలా అదంతా బాగా మిక్స్ అయి.. చివరకు పలుచగా, వెడల్పుగా మారుతుంది. ఇలా మారిన రబ్బరును పక్కకు తీసి, దానిపై సర్ఫ్ వాటర్ పోసి శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దాని మరో యంత్రంపై ఉంచి.. చెప్పుల ఆకారంలో కత్తిరిస్తారు.

Viral Video: సింహం బోనులో ఉంది కదా అని ఇంటర్వ్యూ చేయబోతే.. చివరకు ఎలాంటి సమాధానం వచ్చిందంటే..

ఇలా వచ్చిన చెప్పులకు రంధ్రాలు వేసి, ఫైనల్‌గా కాళ్లకు వేసుకునేందుకు వీలుగా పట్టీలు వేస్తారు. ఈ విధంగా చివరకు హవాయి చెప్పులను తయారీకి సిద్ధం చేసేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’’.. అంటూ కొందరు, ‘‘ఎన్ని రకాల చెప్పులు వచ్చినా.. హవాయి చెప్పులకు మించినవి రావు’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ కర్మాగారం ఆహార కర్మాగారం కంటే ఎంతో పరిశుభ్రంగా ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా.. చల్లటి గాలి కోసం గాడిదను ఎలా వాడుకున్నారో చూడండి..

Updated Date - Feb 07 , 2024 | 09:12 PM