Share News

Viral Video: సింహం బోనులో ఉంది కదా అని ఇంటర్వ్యూ చేయబోతే.. చివరకు ఎలాంటి సమాధానం వచ్చిందంటే..

ABN , Publish Date - Feb 07 , 2024 | 08:24 PM

బోనులో ఉన్న పులులు, సింహాలతో కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. పులితో పరాచకాలు ఆడి కొందరు, సింహంతో చెలగాటమాడి ఇంకొందరు, చింపాంజీకి చిర్రెత్తుకొచ్చేలా చేస్తూ.. మరికొందరు...

Viral Video: సింహం బోనులో ఉంది కదా అని ఇంటర్వ్యూ చేయబోతే.. చివరకు ఎలాంటి సమాధానం వచ్చిందంటే..

బోనులో ఉన్న పులులు, సింహాలతో కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. పులితో పరాచకాలు ఆడి కొందరు, సింహంతో చెలగాటమాడి ఇంకొందరు, చింపాంజీకి చిర్రెత్తుకొచ్చేలా చేస్తూ.. మరికొందరు ప్రమాదంలో పడటం గతంలో చాలా సార్లు చూశాం. అయినా చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు ఏకంగా సింహంతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. బోనులో ఉంది కదా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశాడు. చివరకు ఎలాంటి సమాధానం వచ్చిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జూకు వెళ్లిన ఓ వ్యక్తి.. అందరిలా చేసి ప్రమాదంలో పడకుండా.. ఏదైనా ఫన్నీగా చేయాలని అనుకున్నాడు. చివరకు బోనులో ఉన్న సింహం వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. చిన్న మైక్ తీసుకుని సింహం బోను వద్దకు వెళ్లాడు. అప్పుడే ఓ పెద్ద సింహం అతడి సమీపానికి వచ్చింది. దీంతో వెంటనే (Funny interview with lion) ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు. తనకు తోచిన ప్రశ్నలన్నింటినీ అడగడం మొదలెట్టాడు. అయితే రెండు ప్రశ్నలు వేయగానే.. ‘‘నాకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నచ్చదు.. తమాషా చేయకుండా పక్కకు వెళ్లు’’.. అన్నట్లుగా సింహం తన తల అడ్డంగా తప్పుతుంది. అయినా అతను మరో ప్రశ్న వేస్తాడు. దీంతో మళ్లీ కోపంగా తల పక్కకు తిప్పి హెచ్చరిస్తుంది.

Viral Video: ఆడుకోవాలంటే ఖాళీ స్థలమే కావాలా.. వీళ్ల ఫుట్‌బాల్ గేమ్ చూస్తే నోరెళ్లబెడతారు..

అయినా వినకుండా అతను ఇంకొసారి మైకు సింహం దగ్గర పెట్టి ఏదో అడగబోతాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సింహం కాసేపు మౌనంగా ఉండిపోతుంది. అప్పటికీ ఆగని యువకుడు.. మళ్లీ దగ్గరగా వెళ్లి ఏదో ప్రశ్న వేయబోతాడు. దీంతో సింహానికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘చెప్తుంటే అర్థం కాలేదా’’.. అన్నట్లుగా అతడిపైకి గట్టిగా గాండ్రిస్తుంది. దెబ్బకు అతను భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహంతో ఇంటర్వ్యూ.. వెరీ ఫన్నీ బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘సింహంతో చెలగాటం ఆడితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా.. చల్లటి గాలి కోసం గాడిదను ఎలా వాడుకున్నారో చూడండి..

Updated Date - Feb 07 , 2024 | 08:24 PM