బాదం పప్పుతో పాటూ దాని తొక్కతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

బాదం పప్పులో అనేక ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

బాదం తొక్కలను ఎండబెట్టి పొడిచేసి రోజూ పాలల్లో తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఫేస్ ప్యాక్ వేసుకునే సమయంలో బాదం పప్పు తొక్కలను వినిగిస్తే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

గుడ్డు, తేనె, అలోవెరా జెల్‌లో బాదం తొక్కలను మిక్స్ చేసి, జుట్టుకు రాస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

బాదం తొక్కలతో తయారు చేసిన పేస్ట్ శరీరానికి పూయడం వల్ల అలెర్జీ నుంచి రక్షిస్తుంది.

బాదం తొక్కలను కాల్చి బూడిదను దంతాలపై మర్దనా చేయడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి.