Share News

Viral Video: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో... అంతా పెళ్లి సందడిలో ఉంటే.. ఇతనేమో సైలెంట్‌గా..

ABN , Publish Date - Feb 08 , 2024 | 08:41 PM

దొంగలు రకరకాలుగా ఉంటారు. కొందరు మారణాయుధాలతో బెదిరించి నేరాలకు పాల్పడితే.. మరికొందరు రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు పట్టపగలు పక్కన ఉన్న వారికి కూడా అనుమానం రాకుండా దొంగతనాలు చేసేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో... అంతా పెళ్లి సందడిలో ఉంటే.. ఇతనేమో సైలెంట్‌గా..

దొంగలు రకరకాలుగా ఉంటారు. కొందరు మారణాయుధాలతో బెదిరించి నేరాలకు పాల్పడితే.. మరికొందరు రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు పట్టపగలు పక్కన ఉన్న వారికి కూడా అనుమానం రాకుండా దొంగతనాలు చేసేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో అంతా సందడి సందడిగా ఉంటే.. ఓ వ్యక్తి చేసిన చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సందట్లో సడేమియా అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గ్వాలియర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ కళ్యాణ మంటపంలో అతిథులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా బిజీగా ఉంటారు. కొందరు మహిళలు అక్కడే ఉన్న సోఫాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటారు. వారికి సమీపంలోనే సూటూబూటూ వేసుకున్న ఓ వ్యక్తి నిలబడి ఉంటాడు. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లుగా ఉంటాడు. కాసేపు ఆగాక మెల్లగా మహిళలు కూర్చున్న చోటికి వెళ్తాడు. వారి వెనుకే నిలబడి కాసేపు గమనిస్తాడు. తర్వాత వారి పక్కనే సోఫాలో (man stole the bag) ఉన్న బ్యాగ్ తీసుకుని, స్టైల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

బాదం తొక్కలను పక్కన పడేస్తున్నారా.. ఇకపై ఇలా చేసి చూడండి...

అతను వెళ్లిన కాసేపటి తర్వాత.. అక్కడున్న మహిళలు తమ బ్యాగు కోసం వెతకగా కనిపించదు. అప్పటిదాకా అక్కడే ఉన్న బ్యాగు.. అంతలోనే కనిపించకపోవడంతో షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాగులో రూ.10లక్షల నగదు, నగలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! వీడు హైటెక్ దొంగలా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘అంత నగదు ఉన్న బ్యాగును అలా నిర్లక్ష్యంగా వదిలేయడం ఏంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇదెక్కడి టెక్నిక్‌రా నాయనా.. మహిళ వెనుకే నిలబడి.. అంతా చూస్తుండగానే ఐ ఫోన్ చోరీ..

Updated Date - Feb 08 , 2024 | 08:41 PM