Share News

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

ABN , Publish Date - Feb 09 , 2024 | 08:28 PM

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకొందరు రీల్స్ కోసం ప్రాణాంతక విన్యాసాలు చేయడం కూడా చూశాం. అయితే...

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకొందరు రీల్స్ కోసం ప్రాణాంతక విన్యాసాలు చేయడం కూడా చూశాం. అయితే ఇటీవల యువతులు కూడా రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేయడం సాధారణమైంది. డాన్సులు చేస్తూ కొందరు, ప్రియుడితో సరసాలు ఆడుతూ ఇంకొందరు నెటిజన్ల ఆగ్రహానికి గురైన సందర్భాలను చూశాం. అయితే తాజాగా, ఓ యువతి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. రైలు డోరు వద్ద కూర్చున్న యువతి చివరకు పెద్ద సాహసమే చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రన్నింగ్ ట్రైన్‌లో ఓ యువతి డోరు వద్ద కూర్చుని ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాసేపు ఆగాక ఆమె రైలు నుంచి దిగే ప్రయత్నం చేసింది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలోనే (young woman tried to get down from running train) దిగాలని ప్రయత్నించి, డోరు వద్ద ఉన్న మెట్లపై కాలు పెట్టి నిలబడింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు చూస్తూ ఉన్నా.. ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. పైగా వీడియోలు తీస్తూ వేడుక చూస్తూ ఉన్నారు.

Viral Video: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో... అంతా పెళ్లి సందడిలో ఉంటే.. ఇతనేమో సైలెంట్‌గా..

మెట్లపై నిలబడ్డ యువతి.. కొద్ది సేపటి తర్వాత సడన్‌గా నేల పైకి జంప్ చేసింది. దీంతో అదుపు తప్పి ధబేల్‌మని కింద పడింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. యువతి కింద పడడం చూసి రైల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెకు ప్రాణాలంటే లెక్కలేనట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘వీడియో తీస్తున్న వారికి కొంచెమైనా బుద్ధి ఉందా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంట్లోకి వెళ్లేందుకు పాము ప్రయత్నం.. ఎలాగైనా ఆపేందుకు కుక్కల విశ్వప్రయత్నం.. చివరకు..

Updated Date - Feb 09 , 2024 | 08:28 PM