Share News

Accident Video: హతవిధీ..! విధి ఎంత విచిత్రమైనదీ.. ఈ చిన్నారి ప్రాణం.. ఇలా పోతుందని ఎవరైనా అనుకుంటారా..

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:19 PM

నిజంగానే.. విధి ఎంతో విచిత్రమైనది. బాధలో ఉన్న వారిని ఒక్కసారిగా నవ్వించగలదు. అలాగే సంతోషంగా ఉన్న వారి జీవితంలో ఒక్కసారిగా విషాదాన్నీ నింపేయగలదు. అప్పటిదాకా మన కళ్ల ముందు ఉన్న వారు అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి...

Accident Video: హతవిధీ..! విధి ఎంత విచిత్రమైనదీ.. ఈ చిన్నారి ప్రాణం.. ఇలా పోతుందని ఎవరైనా అనుకుంటారా..

నిజంగానే.. విధి ఎంతో విచిత్రమైనది. బాధలో ఉన్న వారిని ఒక్కసారిగా నవ్వించగలదు. అలాగే సంతోషంగా ఉన్న వారి జీవితంలో ఒక్కసారిగా విషాదాన్నీ నింపేయగలదు. అప్పటిదాకా మన కళ్ల ముందు ఉన్న వారు అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై తల్లితో పాటూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడు ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘హతవిధీ..! విధి ఎంత విచిత్రమైనదీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ (Hyderabad) ఆల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్ గంగపుత్ర కాలనీకి చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అతన్ని చూసేందుకు.. భార్య, ఇద్దరు కొడుకులు గురువారం ఆస్పత్రి వద్దకు వస్తున్నారు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి డీసీఎంను స్థానిక సూపర్ మార్కెట్ ముందు పార్క్ చేశాడు. అయితే వాహనానికి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. సరిగ్గా మహిళ తన పిల్లలతో కలిసి సూపర్ మార్కెట్ ఎదురుగా రాగానే.. డీసీఎం ఒక్కసారిగా ముందుకు కదిలింది. నేరుగా రోడ్డు అవతల వెళ్తున్న (truck runs over boy) బాలుడిపైకి దూసుకెళ్లింది.

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

ట్రక్కు రావడం చూసి తల్లి, ఆమె పెద్ద కొడుకు తప్పించుకున్నారు. అయితే ప్రమాదవశాత్తు 9వేళ్ల తిరుపాల్ అనే చిన్న కొడుకు ట్రక్కు కింద పడ్డాడు. తన కళ్ల ముందే కొడుకు మృత్యువాత పడడాన్ని చూసి తల్లి కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల వారు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Pre - Wedding Video: కాబోయే భార్యతో.. ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. పేషెంట్ ఖుషీ.. చివరకు వైద్యుడేమో..

Updated Date - Feb 10 , 2024 | 04:19 PM