Share News

Viral Video: పిల్ల ఎలిగేటరే కదా అని ప్రేమగా ముద్దు పెట్టబోయాడు.. చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Feb 10 , 2024 | 06:56 PM

క్రూరజంతువులతో పరాచకాలు ఆడుతూ కొందరు, విష సర్పాలతో వింత వింత పనులు చేస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. కొందరైతే ఓ అడుగు ముందుకేసి..

Viral Video: పిల్ల ఎలిగేటరే కదా అని ప్రేమగా ముద్దు పెట్టబోయాడు.. చివరకు ఏమైందో చూడండి..

క్రూరజంతువులతో పరాచకాలు ఆడుతూ కొందరు, విష సర్పాలతో వింత వింత పనులు చేస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. కొందరైతే ఓ అడుగు ముందుకేసి పాములను మెడలో వేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. ముద్దొస్తోందని పిల్ల ఎలిగేటర్‌కు ప్రేమగా ముద్దు పెట్టాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పిల్ల ఎలిగేటర్‌ను (baby alligator) చూసి ఎంతో ముచ్చటపడతాడు. దాన్ని చేతుల్లోకి తీసుకుని ఎంతో సంబరపడతాడు. అలాగే దానిపై చేత్తో నిమురుతో కాసేపు ఆడుకుంటాడు. అంతటితో ఆగకుండా ఎలిగేటర్ తలపై ప్రేమగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా ముద్దు పెట్టాడో లేదో.. ఎలిగేటర్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ఎంత పిల్లనైతే మాత్రం.. నన్ను తక్కువ అంచనా వేస్తావా’’.. అన్నట్లుగా ఒక్కసారిగా వెనక్కు తిరిగి అతడి ముక్కును పట్టుకుంటుంది.

Optical illusion: ఈ చిత్రంలో మరో గుర్రం కూడా దాక్కుని ఉంది.. దాన్ని కనిపెట్టడం మీవల్ల అవుతుందేమో ట్రై చేయండి..

ఎలిగేటర్ ముక్కను గట్టిగా పట్టుకోవడంతో అతడికి ఒక్కసారిగా చుక్కలు కనిపిస్తాయి. గట్టిగా కేకలు పెడుతూ విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఎలాగోలా దాన్ని పక్కకు లాగేస్తాడు. చివరకు చూస్తే అతడి ముక్కుపై నెత్తుటి చారలు కనిపిస్తాయి. పిల్ల ఎలిగేటర్ కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసళ్లతో పిచ్చి పిచ్చి పనులు చేస్తే.. ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘పిల్ల ఎలిగేటర్‌ను తక్కువ అంచనా వేశావ్.. బ్రదర్’’.. అంటూ మరికొందరు, ‘‘మీ టైం బాగుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ.. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న ఆమె.. అంతలోనే..

Updated Date - Feb 10 , 2024 | 07:14 PM