Share News

Viral Video: ఏవమ్మా..! అది కొండచిలువ అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Feb 11 , 2024 | 07:49 PM

పాములు, కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు వీటిని కూడా..

Viral Video: ఏవమ్మా..! అది కొండచిలువ అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

పాములు, కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు వీటిని కూడా పెంపుడు జంతువుల తరహాలో చూస్తుంటారు. ఏమాత్రం భయం లేకుండా వాటితో ఆటలాడుకుంటుంటారు. కొన్నిసార్లు మహిళలు కూడా పాములను పట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ భారీ కొండచిలువను పట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ ఏవమ్మా..! అది కొండచిలువ అనుకున్నావా.. లేక కోడిపిల్ల అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంటపొలాల్లోకి ఓ భారీ కొండచిలువ ప్రవేశిస్తుంది. దాన్ని చూడగానే రైతులు పరుగులు పెడతారు. అయితే ఓ మహిళ మాత్రం ధైర్యంగా ముందుకెళ్తుంది. వెళ్లడమే కాకుండా.. కొండచిలువ వద్దకు వెళ్లి చాకచక్యంగా (woman caught the python) దాని తలను పట్టుకుంటుంది. దీంతో కొండచిలువ కూడా ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయినా ఆమె భయపడకుండా దాని తలను గట్టిగా పట్టుకుంటుంది.

Optical illusion puzzle: గుర్రంపై ఉన్న రాజుకు దొరక్కుండా.. ముగ్గురు దొంగలు దాక్కుని ఉన్నారు.. కనుక్కోండి చూద్దాం..

ఈ క్రమంలో కొండచిలువ ఆమె చేతిని మొత్తం చుట్టేస్తుంది. అయినా ఆమె మాత్రం దాన్ని వదలకుండా అలాగే పట్టుకుంటుంది. ఈమె ధైర్యసాహసాలు చూసి అక్కడున్న వారంతా షాక్ అవుతున్నారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈమేంటీ కొండచిలువను ఇంత ఈజీగా పట్టుకుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈమె ధైర్యానికి సెల్యూట్’’.. అంటూ మరికొందరు, ‘‘పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. మహిళ మంచు తొలగిస్తుండగా.. మధ్యలో..

Updated Date - Feb 11 , 2024 | 07:49 PM