Share News

Viral Video: ఈ పెద్దాయన చాలా అప్‌డేట్‌గా ఉన్నాడే.. వధూవరుల మధ్యలోకి వచ్చి ఎలాంటి సలహా ఇచ్చాడంటే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:05 PM

ఒకప్పటితో పోలిస్తే.. ప్రస్తుతం పెళ్లిళ్ల నిర్వహణ పూర్తిగా మారిపోయింది. సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఇక...

Viral Video:  ఈ పెద్దాయన చాలా అప్‌డేట్‌గా ఉన్నాడే.. వధూవరుల మధ్యలోకి వచ్చి ఎలాంటి సలహా ఇచ్చాడంటే..

ఒకప్పటితో పోలిస్తే.. ప్రస్తుతం పెళ్లిళ్ల నిర్వహణ పూర్తిగా మారిపోయింది. సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఇక వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే ఘటనలైతే.. అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు ఫొటోలు దిగుతున్న సమయంలో మధ్యలో ఓ పెద్దాయన సడన్ ఎంట్రీ ఇచ్చాడు. చివరకు వధువుకు అతడు ఇచ్చిన సలహా చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) దండలు మార్చుకున్న అనంతరం ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. రోటీన్‌గా ఫొటోలు దిగుతున్న వధూవరులను చూడగానే ఓ పెద్దాయనకు ఏమాత్రం నచ్చలేదు.. దీంతో చివరు ఉన్నట్టుండి వారి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరినీ సినిమా స్టైల్లో చేతులపై ముద్దులు (kisses) పెట్టుకోవాలని సూచిస్తాడు.

Viral Video: బద్ధకించిన రెండు సింహాలు.. పరుగెత్తే ఓపిక లేక.. చిన్న పందిని ఎంత సింపుల్‌గా వేటాడాయో చూడండి..

వృద్ధుడి సూచనల మేరకు వరుడు మోకాళ్లపై కూర్చుని వధువు చేయిపై ముద్దు పెడతాడు. తర్వాత వరుడి చేయిపై ఎలా ముద్దు పెట్టాలో... వధువుకు వివరించి చూపిస్తాడు. దీంతో వధువు చివరకు సిగ్గుపడుతూ వరుడి చేతిపై ముద్దు పెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెద్దాయన ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నారు’’.. అంటూ కొందరు, ‘‘వధూరులకు మధురానుభూతిని మిగిల్చాడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గడ్డ కట్టే మంచులో పొగలు కక్కే కాఫీ.. వీళ్ల అతి తెలివి చూస్తే అవాక్కవకుండా ఉండలేరు..

Updated Date - Feb 13 , 2024 | 06:05 PM