Share News

Viral Video: ఐడియా అదుర్స్.. స్టవ్ లేకుండానే.. బైకుపై టీ తయారీ..

ABN , Publish Date - Feb 16 , 2024 | 08:40 PM

‘‘ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరూ చెప్పలేరు’’.. అనే చందంగా ఎవరి బుర్రలో ఎలాంటి తెలివితేటలు ఉంటాయో కూడా ఎవరూ చెప్పలేరు. కొందరి తెలివితేటలు చూస్తే అంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక వస్తువును అంతా ఒకేలా వాడితే.. కొందరు మాత్రం...

Viral Video: ఐడియా అదుర్స్.. స్టవ్ లేకుండానే.. బైకుపై టీ తయారీ..

‘‘ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరూ చెప్పలేరు’’.. అనే చందంగా ఎవరి బుర్రలో ఎలాంటి తెలివితేటలు ఉంటాయో కూడా ఎవరూ చెప్పలేరు. కొందరి తెలివితేటలు చూస్తే అంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక వస్తువును అంతా ఒకేలా వాడితే.. కొందరు మాత్రం అదే వస్తువును వివిధ పనులకు వాడుతుండడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకుపై టీ తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకులో టూర్ వెళ్లిన ఓ యువకుడు చలి ప్రాంతంలో చీటికీమాటికీ టీ తాగడానికి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. బైకు సైలెన్సర్‌‌ను (Bike silencer) చూడగానే.. దాన్నే స్టవ్‌గా ఎందుకు ఉపయోగించుకోకూడదు.. అన్న ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందో తడవుగా ఓ స్టీల్ టిఫిన్ బాక్స్ తీసుకుని సైలెన్సర్‌‌పై గట్టిగా కట్టేశాడు. అవసరమైనప్పుడల్లా అందులో పాలు, చక్కెర, కాఫీ పొడి వేసి పెడితే.. సైలెన్సర్‌ హీట్ కారణంగా వేడి వేడి కాఫీ (Hot coffee) రెడీ అయిపోతుందన్నమాట.

Viral Video: ట్రైనర్‌గా మారిన తల్లికుక్క.. గడప దాటే విధానంపై ఎలా శిక్షణ ఇస్తోందో చూడండి..

దారిలో ఎదురైన కొందరు ఇతడి ఐడియా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వారికి టీ ఎలా చేయాలో చేసి చూపించాడు. టిఫిన్ బాక్స్‌లో పాలు, కాఫీ పొడి, చక్కెర వేసిన తర్వాత మూత మూసేసి.. బైక్ స్పీడ్ పెంచడంతో బాక్సులోని పాలు మరిగాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘బైకును ఇలాక్కూడా వాడుకోవచ్చని ఇప్పుడే చూస్తు్న్నాం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: టూరిస్టుల ఎదుటే చెలరేగిన దున్నపోతు.. తినబోయిన సింహంపై ఎలా తిరగబడిందో చూడండి..

Updated Date - Feb 16 , 2024 | 08:40 PM