Share News

Viral Video: ట్రైనర్‌గా మారిన తల్లికుక్క.. గడప దాటే విధానంపై ఎలా శిక్షణ ఇస్తోందో చూడండి..

ABN , Publish Date - Feb 16 , 2024 | 07:18 PM

కుక్కల తెలివితేటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లో చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లలో పెద్ద పెద్ద మిస్టరీ కేసుల వరకూ విశేష సేవలందించడం చూస్తూనే ఉన్నాం. కొన్ని కుక్కలతే..

Viral Video: ట్రైనర్‌గా మారిన తల్లికుక్క.. గడప దాటే విధానంపై ఎలా శిక్షణ ఇస్తోందో చూడండి..

కుక్కల తెలివితేటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లో చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లలో పెద్ద పెద్ద మిస్టరీ కేసుల వరకూ విశేష సేవలందించడం చూస్తూనే ఉన్నాం. కొన్ని కుక్కలతే మరింత తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. మనుషులను అనుకరించడమే కాదు.. తమ పిల్లలకూ అలాగే శిక్షణ ఇస్తుంటాయి. అలాంటి ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైనర్‌గా మారిన ఓ తల్లి కుక్క.. గడప దాటే విధానంపై తన పిల్లకు ఎంతో ఓర్పుగా శిక్షణ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెంపుడు కుక్క తన పిల్లతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్తుంటుంది. తల్లి కుక్క గడప దాటి బయటికి వెళ్లగానే డోర్ కర్టన్ మూసుకుపోతుంది. దీంతో పిల్ల కుక్క బయటికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతుంది. ఇది గమనించిన తల్లి కుక్క (mother dog) .. అద్దం నుంచి చూస్తూ తన పిల్లకు సలహా ఇస్తుంది. అయినా పిల్ల కుక్కకు బయటికి వెళ్లడం సాధ్యం కాదు. దీంతో తల్లి కుక్క బయటి నుంచి కర్టన్ దాటుకుని మళ్లీ లోపలికి వస్తుంది. ‘‘ఇప్పుడు నేను బయటికి వెళ్తా.. చూసి నేర్చుకో’’.. అన్నట్లుగా పిల్ల కుక్కకు సైగ చేసి మళ్లీ బయటకు వెళ్తుంది.

Viral Video: వీడియో తీయాలని చూడగా ఫోన్ ఎత్తుకెళ్లిన నక్క.. కొద్దిదూరం వెళ్లాక అది చేసిన నిర్వాకం..

అయినా కుక్క పిల్లకు బయటికి వెళ్లడం సాధ్యం కాదు. దీంతో తల్లి కుక్క తల లోపలికి పెట్టి.. ‘‘ఇలా దాటుకుని బయటికి రావాలి’’.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తుంది. దీంతో చివరకు పిల్ల కుక్క కర్టన్ దాటుకుని బయటికి వెళ్లిపోతుంది. ఈ ఘటనను వాటి యజమాని తన ఫోన్‌లో వీడియో తీసుకుని మురిసిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ కుక్క చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘మనుషులు కూడా ఇంత బాగా నేర్పించలేరేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టూరిస్టుల ఎదుటే చెలరేగిన దున్నపోతు.. తినబోయిన సింహంపై ఎలా తిరగబడిందో చూడండి..

Updated Date - Feb 16 , 2024 | 07:20 PM