Share News

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న ఏనుగును గుర్తిస్తే.. మీరే జీనియస్..

ABN , Publish Date - Feb 16 , 2024 | 09:33 PM

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. చెట్ల మధ్యన దాక్కున్న గుడ్ల గూబలు, గుర్రంపై ఫొటోలో దాక్కున్న దొంగలు.. ఇలా అనేక రకాల ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా...

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న ఏనుగును గుర్తిస్తే.. మీరే జీనియస్..

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. చెట్ల మధ్యన దాక్కున్న గుడ్ల గూబలు, గుర్రంపై ఫొటోలో దాక్కున్న దొంగలు.. ఇలా అనేక రకాల ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి మీ ముందుకు తెస్తున్నాం. ఓ వ్యక్తి ఓ చేతిలో కత్తి, మరో చేతిలో ట్రంపెట్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే ఇదే చిత్రంలో ఓ ఏనుగు కూడా ఉంది. అదెక్కడుందో కనిపెట్టగలిగితే మీకంటే జీనియస్ ఎవరూ ఉండరు.

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓ చేత్తో కత్తి, మరో చేత్తో ట్రంపెట్ (trumpet) పట్టుకుని వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతడికి అటు వైపు నేలపై ఓ టెంట్ కూడా ఉంటుంది. అయితే ఇందులోనే ఓ ఏనుగు (elephant) కూడా దాక్కుని ఉంది. కాస్తంత తీక్షణంగా చూస్తే దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. అయినా మీకు కష్టం అనిపిస్తే.. ఆ వ్యక్తిని ఒకటికి రెండు సార్లు బాగా గమనించండి. అలా చేస్తే సమాధానం ఈజీగా తెలిసిపోతుంది. అప్పటికీ గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical.jpg

Viral Video: ఐడియా అదుర్స్.. స్టవ్ లేకుండానే.. బైకుపై టీ తయారీ..

Updated Date - Feb 16 , 2024 | 09:33 PM