Share News

Viral Video: పారాచ్యూట్ లేకుండానే కిందకు దూకేసిన వ్యక్తి.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Feb 18 , 2024 | 07:12 PM

స్కైడైవింగ్‌కు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. చాలామంది సాధారణానికి భిన్నంగా స్కైడైవింగ్ చేయడం చూస్తుంటాం. కొందరు బైకుపై కూర్చుని స్కైడైవింగ్ చేస్తే.. మరికొందరు ..

Viral Video: పారాచ్యూట్ లేకుండానే కిందకు దూకేసిన వ్యక్తి.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

స్కైడైవింగ్‌కు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. చాలామంది సాధారణానికి భిన్నంగా స్కైడైవింగ్ చేయడం చూస్తుంటాం. కొందరు బైకుపై కూర్చుని స్కైడైవింగ్ చేస్తే.. మరికొందరు గుంపులు గుంపులుగా స్కైడైవింగ్ చేయడమే కాకుండా గాల్లో వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే స్కైడైవింగ్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రావిస్ అనే అమెరికన్ వ్యక్తి చేసిన విన్యాసం.. చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కొందరు వ్యక్తులు స్క్రైడైవింగ్ చేసేందుకు విమానంలో ఆకాశంలోకి దూసుకెళ్లారు. చాలా పైకి వెళ్లాక విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఓ వ్యక్తి పారాచ్యూట్ కట్టుకోకపోవడంతో పాటూ కనీసం షర్ట్ కూడా వేసుకోకుండా కిందకు దూకాడు. అతడితో పాటూ మరో ముగ్గురు పారాచ్యూట్ కట్టుకుని దూకారు. షర్ట్ లేకుండా దూకిన వ్యక్తి ఏమాత్రం భయపడకుండా.. కూల్ డ్రింక్ తాగుతూ కిందకు దూకేశాడు. గాలిలో కెమెరాకు ఫోజులు ఇస్తూ పల్టీలు కొట్టాడు. అలా వేగంగా కిందకు వచ్చే క్రమంలో మిగతా ఇద్దరు వ్యక్తులు అతడి దగ్గరగా వెళ్లారు.

Ex girlfriend: వారంలో మూడు రోజులు.. ప్రియుడికి వింత కండీషన్లు.. చివరకు జరిగింది ఇదీ..

వారిలో ఓ వ్యక్తి.. పారాచ్యూట్ లేని వ్యక్తిని గట్టిగా పట్టకుంటాడు. అతడి సాయంతో ఎట్టకేలకు క్షేమంగా కిందకు దిగేశాడు. అయితే ఈ క్రమంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అతడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేది. అయితే వారంతా క్షేమంగా కిందకు దిగడంతో.. అంతా హమ్మయ్య!.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది మామూలు స్టంట్ కాదు బాబోయ్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు.. చాలా ప్రమాదం బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై వధువు తుంటరి పనికి.. వరుడి వింత రియాక్షన్ చూసి.. అవాక్కైన అతిథులు..

Updated Date - Feb 18 , 2024 | 07:12 PM