Share News

Ex girlfriend: వారంలో మూడు రోజులు.. ప్రియుడికి వింత కండీషన్లు.. చివరకు జరిగింది ఇదీ..

ABN , Publish Date - Feb 17 , 2024 | 07:46 PM

ప్రేమికుల మధ్య ప్రేమ ఎంతుంటే తెలీదు గానీ.. అనుమానాలు, అలగడాలు, గొడవ పడడం మాత్రం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అయితే చివరికి ఎవరో ఒకరు క్షమాపణలు చెప్పడం ద్వారా అవి అంతటితో సమసిసపోతుంటాయి. అయితే...

Ex girlfriend: వారంలో మూడు రోజులు.. ప్రియుడికి వింత కండీషన్లు.. చివరకు జరిగింది ఇదీ..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికుల మధ్య ప్రేమ ఎంతుంటే తెలీదు గానీ.. అనుమానాలు, అలగడాలు, గొడవ పడడం మాత్రం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అయితే చివరికి ఎవరో ఒకరు క్షమాపణలు చెప్పడం ద్వారా అవి అంతటితో సమసిసపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ సమస్యలు శృతిమించిపోతుంటాయి. తమ పార్ట్నర్ విషయంలో విచిత్రమైన కండీషన్లు పెడుతుంటారు. తాము చెప్పిందే చేయాలని, లేకపోతే ప్రేమ కొనసాగదంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతుంటారు. తాజాగా, ఓ ప్రేమ జంట విషయంలో ఇలాగే జరిగింది. మాజీ ప్రియురాలు తన ప్రియుడికి విచిత్ర కండీషన్లు పెట్టింది. చివరకు ఏం జరిగిందంటే..

ప్రేమకు హద్దులు ఉండవు కానీ.. ప్రేమికులే ఏవేవో పరిమితులు విధించుకుంటుంటారు. ఇవి కొన్నిసార్లు పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఐర్లాండ్‌కు చెందిన జార్లోట్ రైస్ అనే ఫిల్మ్ మేకర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2002లో ఇతడికి ఓ కేఫ్‌లో లీనా తంటాష్ అనే ఓ యువతి (young woman) పరిచయమైంది. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. మొదట్లో ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. అయితే రాను రాను వీరి మధ్య సమస్యలు తలెత్తాయి. సదరు యువతి రోజూ తన ప్రియుడికి వింత వింత కండీషన్లను పెడుతూ వచ్చింది. వారంలో కనీసం మూడు రోజులు గడపాలని, రోజూ సాయంత్రం 15 నిముషాలు ఫోన్లలో మాట్లాడాలని.. ఇలా ఏవేవో షరతులు (conditions) విధించింది. ఈ కండీషన్లు విని అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Viral Video: గుర్రం ముందు ఇలాంటి డాన్స్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా.. ఇతడూ అలాగే చేస్తే చివరకు..

తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేది. ఈ వేధింపులు భరించలేక అతడు ఆమెను దూరం పెట్టాడు. అయినా ఆమె ఫోన్లు చేస్తూ, ఈమెల్స్ చేస్తూ బెదిరించసాగింది. ఇలా 10 సంవత్సరాల పాటు వేధిస్తూనే ఉంది. నంబర్ మార్చుకున్నా కూడా.. ఏదో రకంగా కనుక్కుని మళ్లీ వేధించడం మొదలెట్టేది. అంతటితో ఆగకుండా ఓ గూఢచారిని నియమించి, ప్రియుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలుసుకునేది. ఒకానొక సందర్భంలో అతడిని హత్య చేయించాలని కూడా చూసింది. చివరకు దేశం విడిచి వెళ్లినా స్నేహితుల ద్వరారా ఫోన్లు చేసి బెదిరిస్తుండేది. వేధింపులు ఎక్కువవడంతో చివరకు అతను ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం చివరకు ఆమెకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం (Viral news) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: బైకులో వెళ్తున్న పల్లెటూరి జంటను చూసి ఫిదా అయిన కారు యజమాని.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Updated Date - Feb 17 , 2024 | 07:51 PM