Share News

Viral Video: బైక్‌పై వెళ్తున్న పల్లెటూరి జంటను చూసి ఫిదా అయిన కారు యజమాని.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:18 PM

భార్యాభర్తల మధ్య ఎలాంటి అలమరికలు లేకుంటే.. వారి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది దంపతులు వివిధ రకాల సమస్యలతో నిత్యం సతమతమవుతున్నారు. కొన్నిసార్లు ...

Viral Video: బైక్‌పై వెళ్తున్న పల్లెటూరి జంటను చూసి ఫిదా అయిన కారు యజమాని.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

భార్యాభర్తల మధ్య ఎలాంటి అలమరికలు లేకుంటే.. వారి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది దంపతులు వివిధ రకాల సమస్యలతో నిత్యం సతమతమవుతున్నారు. కొన్నిసార్లు భర్తపై భార్య అనుమానం పెంచుకుని గొడవలకు దిగితే.. మరికొన్నిసార్లు భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. చివరకు చిత్రహింసలకు పాల్పడే ఘటనలు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి ప్రస్తుత తరుణంలో అన్యోన్యంగా ఉండే దంపతులను చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. తాజాగా, ఇలాంటి దంపతుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బైకుపై వెళ్తున్న పల్లెటూరి జంటను చూసి కారులో వెళ్తున్న వారు ఫిదా అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు కారులో వెళ్తుండగా.. మార్గ మధ్యలో వారికి ఓ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఓ పల్లెటూరి వ్యక్తి తన బైకు వెనుకవైపు గడ్డి మోపు కట్టుకున్నాడు. పొలం నుంచి గడ్డిని ఇంటికి వెళ్లే క్రమంలో భార్యను కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే బైకు వెనుక వైపు స్థలం లేకపోవడంతో చిన్న పిల్లల తరహాలో తన భార్యను ముందు వైపు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టు్కోవడమే కాకుండా ఎంతో ప్రేమగా భార్యతో మాట్లాడుకుంటూ సరదాగా ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్తున్న వారు వీరిని చూసి ఫిదా అయ్యారు.

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న ఏనుగును గుర్తిస్తే.. మీరే జీనియస్..

ఈ దంపతులు కష్టపడి జీవిస్తున్నా కూడా.. ఎంతో అన్యోన్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వారిని వీడియో తీస్తూ అలాగే చూస్తుండిపోయారు. కారులో వెళ్తున్న వారు వీడియో తీయడం చూసి బైకుపై వెళ్తున్న వ్యక్తి నవ్వుతూ పలకరించాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది’’.. అంటూ కొందరు, ‘‘పల్లెటూళ్లలో మాత్రమే ఇలాంటి వాళ్లను చూస్తుంటాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గుర్రం ముందు ఇలాంటి డాన్స్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా.. ఇతడూ అలాగే చేస్తే చివరకు..

Updated Date - Feb 17 , 2024 | 05:02 PM